పెళ్లి కూతురికి కరోనా పాజిటివ్, అయినా పీపీఈ కిట్లు ఉన్నాయిగా ! జరిగిందండీ పెళ్లి !
రాజస్థాన్ లోని షాహనాబాద్ జిల్లాలో ఓ జంట పెళ్లి చేసుకుంది. ఇందులో వింతేముంది అనుకుంటే తప్పులో కాలేసినట్టే ! ఈ కరోనా కాలంలో దానికి తగినట్టే ఈ తంతు కూడా జరగాల్సిందేగా !
రాజస్థాన్ లోని షాహనాబాద్ జిల్లాలో ఓ జంట పెళ్లి చేసుకుంది. ఇందులో వింతేముంది అనుకుంటే తప్పులో కాలేసినట్టే ! ఈ కరోనా కాలంలో దానికి తగినట్టే ఈ తంతు కూడా జరగాల్సిందేగా ! అందుకే పెళ్ళికూతురుకు కరోనా వైరస్ పాజిటివ్ సోకినా..నా వెడ్డింగ్ జరగాల్సిందే అని పట్టు బట్టింది. ఇక పెళ్లి కొడుకు కూడా ఓకె చెప్పగా…పెళ్లి జరిపించే పురోహితుడు కూడా నసుగుతూనే సరే అన్నాడట ! కరోనా పీపీఈ కిట్లనే కోట్లుగా ధరించిన పురోహితుడు, అతని అసిస్టెంట్ కూడా మంత్రాలు చదువుతూ ఈ వివాహాన్ని కానిచ్చారు. మాస్కులు వగైరాలు ధరించిన వధూవరులు ‘ ఏ కరోనా క్యా కరేగా’ అన్నట్టు ఒకింటివారయ్యారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం అధికారుల అనుమతితో.. ఈ వినూత్న వివాహం జరిగింది. తలకు టర్బన్ చుట్టుకున్న వ్యక్తినే పెళ్లికొడుకుగా మనం గుర్తు పట్టాల్సి ఉంటుంది. అదీ సంగతి !
#WATCH Rajasthan: A couple gets married at Kelwara Covid Centre in Bara, Shahbad wearing PPE kits as bride’s #COVID19 report came positive on the wedding day.
The marriage ceremony was conducted following the govt’s Covid protocols. pic.twitter.com/6cSPrJzWjR
— ANI (@ANI) December 6, 2020