పోలీసు శాఖలో కలకలం.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కామారెడ్డి డీఎస్పీ అరెస్ట్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కామ రెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇటీవల లక్ష్మీనారాయణ ఇంట్లో తనికీలు నిర్వహించిన ఏసీబీ అధికారులు ఆదాయానికి మించి 2.11 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇటీవల లక్ష్మీనారాయణ ఇంట్లో తనికీలు నిర్వహించిన ఏసీబీ అధికారులు ఆదాయానికి మించి 2.11 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. హైదరాబాద్, నల్లగొండ, కామారెడ్డి జిల్లాల్లో నిర్వహించిన సోదాల్లో నగదు, బంగారంతో పాటు నివాస స్థలాలు, ఇండ్లు, వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలు లభించాయి. దాంతో ఆయనను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో బెట్టింగ్ కేసులలో డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణ నేపథ్యంలో ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో డీఎస్పీ అక్రమాస్తుల వ్యవహారం సైతం వెలుగు చూశాయి. వివిధ ప్రాంతాల్లోని డీఎస్పీ నివాసాల్లో 16 రోజులుగా ఏసీబీ సోదాలు చేస్తున్నారు. తాజాగా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని తేలడంతో లక్ష్మీనారాయణను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.