బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడి ఇంట తీవ్ర విషాదం.. నలుగురు కుటుంబసభ్యుల ఆత్మహత్య..!
రాజస్థాన్ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మదన్ లాల్ సైనీ కుటుంబంలోని నలుగురు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు.
Madanlal family suicide : రాజస్థాన్ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మదన్ లాల్ సైనీ కుటుంబంలోని నలుగురు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మదన్ లాల్ కొడుకు వరుస అయిన హనుమాన్ ప్రసాద్‌తో సహా నలుగురు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. హనుమాన్ ప్రసాద్ స్వయాన బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మదన్ లాల్ సైనీకి సోదరుని కుమారుడు అని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇటీవల హనుమాన్ ప్రసాద్ పెద్ద కుమారుడు మృతిచెందాడు. దీంతో ఇంటిలోని మిగిలినవారంతా మానసిక వ్యథకు లోనయ్యారు. ఈ నేపధ్యంలో వీరంతా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చనిపోయిన వారిని హనుమాన్ ప్రసాద్, అతని భార్య తార, ఇద్దరు కుమార్తెలు అను, పూజలుగా పోలీసులు గుర్తించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న వెంటనే సీకర్ జిల్లా ఉద్యోగ్ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కాగా, హనుమాన్ ప్రసాద్ పెద్ద కుమారుడు 2020 సెప్టెంబరులో మృతి చెందాడు. హనుమాన్ ప్రసాద్ రాసినట్లుగా భావిస్తున్న సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ పెద్ద కుమారుడు మృతి చెందిన తరువాత మిగిలిన వారికి బతకాలనే ఆశ లేదని నోట్ పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఆ నాలుగు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.
Read Also.. Bride Runs Away: ముహూర్తం టైమ్‌కు వధువు జంప్.. చెల్లిని పెళ్లాడిన వరుడు.! అంతలోనే ట్విస్ట్.?