Healing: అంతా ఇత్తడి మహిమ.. భాగ్యనగరంలో నాటు వైద్యుల నయా దందా.. నిజంగా మంత్రాలకు చింతకాయలు రాలుతాయా..?

ప్రపంచం మొత్తం ఆధునిక యుగంలో దూసుకుపోతోంది. అంతటా అత్యాధునిక సాంకేతిక విజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఎప్పటికప్పుడు అత్యాధునిక వైద్యసేవలు కూడా ప్రజలకు చేరువవుతున్నాయి. అయినప్పటికీ మూఢవైద్యం, మూఢ నమ్మకాలు..

Healing: అంతా ఇత్తడి మహిమ.. భాగ్యనగరంలో నాటు వైద్యుల నయా దందా.. నిజంగా మంత్రాలకు చింతకాయలు రాలుతాయా..?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 30, 2021 | 1:15 PM

Superstition: ప్రపంచం మొత్తం ఆధునిక యుగంలో దూసుకుపోతోంది. అంతటా అత్యాధునిక సాంకేతిక విజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఎప్పటికప్పుడు అత్యాధునిక వైద్యసేవలు కూడా ప్రజలకు చేరువవుతున్నాయి. అయినప్పటికీ మూఢవైద్యం, మూఢ నమ్మకాలు ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. ఇత్తడి ప్లేటుతో రోగాలు తగ్గిపోతాయంటూ నాటు వైద్యులు ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇది ఎక్కడో కాదు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నాటువైద్యం మూడు పువ్వులు.. ఆరు కాయల్లా సాగూతూ కొంతమందికి కాసుల వర్షం కురిపిస్తోంది. హైదరాబాద్‌ నగరశివారులో నాటు వైద్యం యథేచ్చగా జరుగుతున్న విషయాన్ని విషయాన్ని టీవీ-9 వెలుగులోకి తీసుకువచ్చింది. నగరశివారు ప్రాంతాలైన మహేశ్వరం, ఇబ్రహీంపట్నంలోని పోచారం ప్రాంతాల్లో మంత్రవైద్యం ఫేమస్‌ అయింది. రోగులు కూడా పెద్దసంఖ్యలో వెళ్తుండటంతో నాటువైద్యంపై టీవీ-9 నిఘా బృందం కీలక విషయాలను సేకరించింది.

మహేశ్వరంలో నాటువైద్యుడి నాటకాలు ఇత్తడితో రోగాలు నయం చేస్తానంటూ మహేశ్వరంలో నాటు వైద్యుడు ప్రజల దగ్గరి నుంచి దండుకుంటున్నాడు. ఒక ఇత్తడి పళ్లెం వీపుమీద ఉంచితే.. ఆ వెంటనే అది విషాన్ని హరించేస్తుందని నాటు వైద్యుడు చెబుతున్నాడు. ప్రస్తుతం టీవీ-9 సేకరించిన ఆ దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఒంట్లో ఎన్ని రోగాలు ఉన్నా.. కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నా.. పళ్లెంతో పటాపంచలు చేస్తానంటూ మోసగిస్తున్నాడు.

ఇబ్రహీంపట్నంలో రిటైర్డ్‌ ప్రభుత్వ ఉపాధ్యాయుడి వేశాలు.. ఇబ్రహీంపట్నంలో కూడా ఓ రిటైర్డ్‌ ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. నాటు వైద్యుడి అవతారమెత్తాడు.. పాతికేళ్ల కిందటే ప్లేట్‌ మంత్రం నేర్చుకున్నానంటూ ప్రజలను మభ్యపెడుతున్నాడు. టీవీ-9 బృందాన్ని చూసి ఆయన ప్లేట్‌ వైద్యం మానేశానంటూ ప్లేటు ఫిరాయించాడు. సమస్యతో వచ్చారు కాబట్టి మీకు మంత్రం నేర్పిస్తానని.. మీరే ట్రీట్‌ మెంట్ చేసుకోండంటూ సలహాలు ఇచ్చి చివరకు ఇరకాటంలో పడ్డాడు.

అంతా మోసం.. కార్పోరేట్ ఆసుపత్రికెళ్తే ఎక్కువ డబ్బులు ఖర్చవుతాయనో, ప్రభుత్వాసుపత్రికి వెళ్తే సరిగ్గా చూస్తారో లేదోనంటూ ప్రజలు ఇంకా మూఢ వైద్యం వైపు మొగ్గు చూపుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. దీనినే చాలా మంది క్యాష్ చేసుకుంటూ.. ప్రజలను బలి పశువులు చేస్తున్నారని డాక్టర్లు చెబుతున్నారు. ఇలాంటి వైద్యాన్ని నమ్మి ప్రాణాలమీదకి తెచ్చుకోవద్దంటూ వైద్యులు సూచిస్తున్నారు.

Also Read: 

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..