Silver Price Today: భారీగా పెరిగిన వెండి ధరలు.. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర ఎంత ఉందంటే ?
గత కొన్ని రోజులుగా బంగారం ధరలతోపాటు వెండి రేట్లు కూడా తగ్గుతూ వచ్చాయి. దేశీయ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు స్థిరంగా ఉండగా.. వెండి
గత కొన్ని రోజులుగా బంగారం ధరలతోపాటు వెండి రేట్లు కూడా తగ్గుతూ వచ్చాయి. దేశీయ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు స్థిరంగా ఉండగా.. వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి. శుక్రవారంతో పోల్చుకుంటే వెండి ధర రూ.800 పెరిగి దేశీయ మార్కెట్లో కిలో వెండి రూ.70,000కు చేరింది.
అటు హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.74,600కు చేరింది. ఇక విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో కిలో వెండి ధర రూ.74,600 దగ్గర ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రూ.70,000 ఉండగా.. ముంబైలో కేజీ సిల్వర్ ధర రూ.70,000 ఉంది. చెన్నై మార్కెట్లో కిలో వెండి ధర రూ.74,600 దగ్గర ఉంది.