TV9 Telugu Digital Desk | Edited By: Ram Naramaneni
Updated on: Oct 12, 2020 | 4:55 PM
జమ్మూకాశ్మీర్ పుల్వామా జిల్లాలో బుధవారం ఓ స్కూల్ బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది. ఈ ఘటనలో దాదాపు 19 మంది విద్యార్థులు గాయపడ్డారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ప్రాంతంలో పేలుడు జరిగింది. ఆ సమయంలో విద్యార్థులు వింటర్ ట్యూషన్లకు హాజరయ్యారు. పేలుడు వలన పెద్ద సంఖ్యలో విద్యార్థులు గాయపడ్డారని స్థానిక వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నామన్నారు. తీవ్రంగా గాయపడిన కొందరు విద్యార్థులను ప్రత్యేక వైద్య సదుపాయాల కోసం శ్రీనగర్ లోని ఆస్పత్రికి తరలించామని […]
జమ్మూకాశ్మీర్ పుల్వామా జిల్లాలో బుధవారం ఓ స్కూల్ బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది. ఈ ఘటనలో దాదాపు 19 మంది విద్యార్థులు గాయపడ్డారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ప్రాంతంలో పేలుడు జరిగింది. ఆ సమయంలో విద్యార్థులు వింటర్ ట్యూషన్లకు హాజరయ్యారు. పేలుడు వలన పెద్ద సంఖ్యలో విద్యార్థులు గాయపడ్డారని స్థానిక వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నామన్నారు. తీవ్రంగా గాయపడిన కొందరు విద్యార్థులను ప్రత్యేక వైద్య సదుపాయాల కోసం శ్రీనగర్ లోని ఆస్పత్రికి తరలించామని తెలిపారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.