బుద్గామ్ హెలికాప్టర్ కూలిన ఘటనలో మాయమైన బ్లాక్‌బాక్స్

శ్రీ నగర్‌ : గత నెలలో కాశ్మీర్ లోని బుద్గామ్ లో ఓ సైనిక హెలికాప్టర్ కూలిపోయిన ఘటనపై భారత వాయుసేన ఓ సంచలన విషయాన్ని వెల్లడించింది. ఫిబ్రవరి 27వ తేదీన పాక్‌ విమానాలు కాశ్మీర్‌లోకి ప్రవేశించిన సమయంలో.. గాల్లోకి ఎగిరిన హెలికాప్టర్ బుద్గామ్‌ సమీపంలో  కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు సైనిక సిబ్బంది మృతిచెందారు. అయితే ఈ ఘటనలో హెలికాప్టర్‌కి చెందిన బ్లాక్‌బాక్స్‌ మాయమైంది. బ్లాక్‌బాక్స్‌, ఫ్లైట్‌ డేటా రికార్డర్‌ మాయమైనట్లు వాయుసేన అధికారులు వెల్లడించారు. […]

బుద్గామ్ హెలికాప్టర్ కూలిన ఘటనలో మాయమైన బ్లాక్‌బాక్స్
Follow us

| Edited By:

Updated on: Mar 30, 2019 | 6:17 PM

శ్రీ నగర్‌ : గత నెలలో కాశ్మీర్ లోని బుద్గామ్ లో ఓ సైనిక హెలికాప్టర్ కూలిపోయిన ఘటనపై భారత వాయుసేన ఓ సంచలన విషయాన్ని వెల్లడించింది. ఫిబ్రవరి 27వ తేదీన పాక్‌ విమానాలు కాశ్మీర్‌లోకి ప్రవేశించిన సమయంలో.. గాల్లోకి ఎగిరిన హెలికాప్టర్ బుద్గామ్‌ సమీపంలో  కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు సైనిక సిబ్బంది మృతిచెందారు. అయితే ఈ ఘటనలో హెలికాప్టర్‌కి చెందిన బ్లాక్‌బాక్స్‌ మాయమైంది. బ్లాక్‌బాక్స్‌, ఫ్లైట్‌ డేటా రికార్డర్‌ మాయమైనట్లు వాయుసేన అధికారులు వెల్లడించారు. దీనికోసం గాలింపు చర్యలను తీవ్రం చేశామని అధికారులు పేర్కొన్నారు.

అయితే ఓ విమానం కానీ, హెలికాప్టర్ కానీ ప్రమాదానికి గురైనప్పుడు అందుకు గల కారణాలు తెలిసేది బ్లాక్ బాక్స్, డేటా రికార్డర్ వల్లే. కానీ, ఈ ప్రమాదంలో భారత వాయుసేన అధికారులకు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. బ్లాక్ బాక్స్ తో పాటు ఫ్లయిట్ డేటా రికార్డర్ ను సమీప గ్రామస్తులే ఎత్తుకెళ్లి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. హెలికాప్టర్ కూలిపోయిన వెంటనే కొందరు స్థానికులు హెలికాప్టర్ కు సంబంధించిన విడిభాగాలు తీసుకుపోయినట్టు అధికారుల దృష్టికి వచ్చింది. దాంతో, సమీప గ్రామాల్లో బ్లాక్ బాక్స్, డేటా రికార్డర్ కోసం సోదాలు ముమ్మరం చేశారు.