AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్రీ వ్యాక్సీన్ హామీ కోడ్ ఉల్లంఘన కాదు, ఎన్నికల కమిషన్

ఉచిత వ్యాక్సీన్ ఇస్తామంటూ బీహార్ ఎన్నికల సందర్భంగా బీజేపీ ఇచ్చిన హామీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) ని అతిక్రమించినట్టు కాదని ఈసీ స్పష్టం చేసింది. ఇందులో కోడ్ ను ఉల్లంఘించిన దాఖలాలు లేవని పేర్కొంది. సాకేత్ గోఖలే అనే యాక్టివిస్ట్ దాఖలు చేసిన ఆర్ టీ ఐ ని పురస్కరించుకుని ఎన్నికల సంఘం ఈ విషయాన్ని తేల్చి చెప్పింది’ రాజ్యాంగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అన్నదొకటి ఉంది…ఎలెక్షన్ మేనిఫెస్టోలో ఓ సంక్షేమ చర్యకు […]

ఫ్రీ వ్యాక్సీన్ హామీ కోడ్ ఉల్లంఘన కాదు, ఎన్నికల కమిషన్
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 31, 2020 | 4:07 PM

Share

ఉచిత వ్యాక్సీన్ ఇస్తామంటూ బీహార్ ఎన్నికల సందర్భంగా బీజేపీ ఇచ్చిన హామీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) ని అతిక్రమించినట్టు కాదని ఈసీ స్పష్టం చేసింది. ఇందులో కోడ్ ను ఉల్లంఘించిన దాఖలాలు లేవని పేర్కొంది. సాకేత్ గోఖలే అనే యాక్టివిస్ట్ దాఖలు చేసిన ఆర్ టీ ఐ ని పురస్కరించుకుని ఎన్నికల సంఘం ఈ విషయాన్ని తేల్చి చెప్పింది’ రాజ్యాంగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అన్నదొకటి ఉంది…ఎలెక్షన్ మేనిఫెస్టోలో ఓ సంక్షేమ చర్యకు సంబంధించి హామీ ఇస్తే అభ్యంతరం ఉండరాదని అందులో క్లియర్ కట్ గా ఉంది’ అని ఈసీ వెల్లడించింది. నెరవేర్చగలిగిన హామీల విషయంలో ఓటర్ల విశ్వాసాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుందని మరింతగా విశదీకరించింది. తాము అధికారంలోకి వస్తే.. ఫ్రీ  వ్యాక్సీన్ ఇస్తామని బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసిన సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం గమనార్హం.

అయితే ఈ హామీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉధ్ధవ్ థాక్రే తదితరులు అనుమానాన్ని, అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా ఫ్రీ వ్యాక్సీన్ ఇస్తారా లేక బీహారీలకేనా అని వీరితో బాటు పలువురు డౌట్స్ తో ప్రశ్నలను సంధించారు.

Follow Us