బెంగాల్, యూపీ ఎన్నికలపై ఫోకస్, బీజేపీ ఇన్-ఛార్జ్‌ల నియామకం, జేపీ.నడ్డా క్రియాశీల వ్యూహం

బీహార్ ఎన్నికల్లో  లో ఎన్డీయే ఘన విజయంతో ఇక బీజేపీ వివిధ రాష్టాల్లో జరగనున్న ఎన్నికల మీదా దృష్టి పెట్టింది. పశ్చిమ బెంగాల్, అస్సాం, మధ్యప్రదేశ్ సహా కీలకమైనవని భావించిన అన్ని రాష్ట్రాలనుకైవసం చేసుకునే యత్నంలో భాగంగా పార్టీ అధ్యక్షుడు జేపీ.నడ్డా భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. హోమ్ మంత్రి అమిత్ షాకు సన్నిహితుడని భావిస్తున్న మురళీధరరావును మధ్యప్రదేశ్ ఇన్-ఛార్జ్ గా నియమించారు. కొత్తగా పార్టీ ప్రధానకార్యదర్శి పదవిని చేబట్టిన పురందేశ్వరికి  ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల […]

బెంగాల్, యూపీ ఎన్నికలపై ఫోకస్, బీజేపీ ఇన్-ఛార్జ్‌ల నియామకం, జేపీ.నడ్డా క్రియాశీల వ్యూహం
Follow us

| Edited By: Rajesh Sharma

Updated on: Nov 14, 2020 | 11:42 AM

బీహార్ ఎన్నికల్లో  లో ఎన్డీయే ఘన విజయంతో ఇక బీజేపీ వివిధ రాష్టాల్లో జరగనున్న ఎన్నికల మీదా దృష్టి పెట్టింది. పశ్చిమ బెంగాల్, అస్సాం, మధ్యప్రదేశ్ సహా కీలకమైనవని భావించిన అన్ని రాష్ట్రాలనుకైవసం చేసుకునే యత్నంలో భాగంగా పార్టీ అధ్యక్షుడు జేపీ.నడ్డా భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. హోమ్ మంత్రి అమిత్ షాకు సన్నిహితుడని భావిస్తున్న మురళీధరరావును మధ్యప్రదేశ్ ఇన్-ఛార్జ్ గా నియమించారు.

కొత్తగా పార్టీ ప్రధానకార్యదర్శి పదవిని చేబట్టిన పురందేశ్వరికి  ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల బాధ్యతను అప్పగించారు. రామ్ మాధవ్ ను మణిపూర్, జమ్మూకాశ్మీర్ కు, తరుణ్ ఛుగ్ ను తెలంగాణకు, బైజయంత్ జై ను అస్సాంకు, సీటీ రవిని మహారాష్ట్ర, గోవా, తమిళనాడు రాష్ట్రాలకు ఇన్-చార్జులుగా నియమించారు. దుశ్యంత్ గౌతమ్ కు  పంజాబ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, రాష్ట్రాల బాధ్యతను అప్పగించారు.

పశ్చిమ బెంగాల్ పార్టీ వ్యవహారాల్లో విజయ్ కైలాష్ వర్గీయకు పార్టీ సమాచార, టెక్నాలజీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ సహకరించనున్నారు. బీహార్ రాష్ట్రానికి భూపేంద్ర యాదవ్ ను నియమించారు. ఆయన గుజరాత్ పార్టీ వ్యవహారాలను కూడా చూస్తారు. యూపీ ఇన్-ఛార్జ్ రాధామోహన్ సింగ్ కు సత్య కుమార్, సునీల్ ఓఝా, సంజీవ్  చౌరాసియా సహకరిస్తారు. రాధామోహన్ సింగ్ రాజస్థాన్ పార్టీ వ్యవహారాలను కూడా పర్యవేక్షిస్తారు.