రూమర్లకు మరోసారి చెక్ పెట్టిన సుమ.. నువ్వే నా బలం, సంతోషమంటూ

విలక్షణ నటుడు రాజీవ్‌ కనకాల శుక్రవారం తన పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన భార్య, ప్రముఖ యాంకర్ సుమ కనకాల సోషల్ మీడియాలో స్పెషల్ విష్‌ చేశారు

రూమర్లకు మరోసారి చెక్ పెట్టిన సుమ.. నువ్వే నా బలం, సంతోషమంటూ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 21, 2020 | 1:04 PM

Suma Wishes Rajiv Kanakala: విలక్షణ నటుడు రాజీవ్‌ కనకాల శుక్రవారం తన పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన భార్య, ప్రముఖ యాంకర్ సుమ కనకాల సోషల్ మీడియాలో స్పెషల్ విష్‌ చేశారు. నాకు ఎంతో ఇష్టమైన రాజా.. నీకు హ్యాపీ బర్త్‌డే. నువ్వే నా బలం, నా సంతోషం. ప్రతి రోజు కొత్త రోజుగా నీతో ఉండాలనుకుంటున్నా. లవ్‌ యు. నీతో నేను ఏకత్వంతో ఉన్నా అని కామెంట్ పెట్టారు. (మీరే దేశానికి వెలకట్టలేని ఆస్తి.. చిన్నారులకు సీఎం జగన్ బాలల దినోత్సవం శుభాకాంక్షలు)

కాగా రాజీవ్‌, సుమల మధ్య గొడవలైనట్లు.. వారిద్దరు విడివిడిగా ఉన్నట్లు ఆ మధ్యన వార్తలు చక్కర్లు కొట్టాయి. రాజీవ్‌ తల్లిదండ్రులు ఉన్నప్పుడు వారు సర్దిచెప్పేవారని, కానీ వారిద్దరు కాలం చేయడంతో వీరిద్దరు విడాకులు తీసుకున్నారని, సుమ పిల్లలతో పక్కన ఉండోందని ఏవేవో పుకార్లు వినిపించాయి. కానీ వాటన్నింటిని ఆ మధ్యన సుమ తన షోలో కొట్టిపారేశారు. ఆమె వ్యాఖ్యతగా వ్యవహరించే క్యాష్‌ షోలో రాజీవ్‌ వచ్చినప్పుడు సుమ చాలా ఎమోషనల్‌ అయ్యారు. ఐ లవ్‌ యు రాజా అంటూ స్టేజ్‌ మీదనే ఏడ్చేశారు. ఇక ఇప్పుడు మరోసారి తన భర్తపై ప్రేమను చాటుకున్నారు. (మావటితో మాట్లాడుతున్న శ్రీరంగం దేవాలయం ఏనుగు.. వీడియో వైరల్‌.. వావ్ అంటోన్న నెటిజన్లు)

మరోవైపు రాజీవ్‌ కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. అందరి ఇళ్లల్లో చిన్న చిన్న గొడవల్లాగే తమ ఇంట్లో కూడా జరిగాయని, కానీ అది మీడియా వారికి తప్పుగా వెళ్లిందని తెలిపారు. ఆ రూమర్లు వచ్చినప్పుడు సుమ బాధపడిందని, పిల్లలపై వాటి ప్రభావం పడుతుందని ఫీల్ అయ్యిందని అన్నారు. సుమకు చాలా ఓపిన అని, ముఖంపై నవ్వును ఎప్పుడూ పోగొట్టుకోదని, అదే ఆమెలో నాకు నచ్చుతుందని చెప్పుకొచ్చారు. (కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,050 కొత్త కేసులు.. నలుగురు మృతి.. కోలుకున్న 1,736 మంది)