ఇంట్రస్టింగ్‌గా ‘మహా సముద్రం’ థీమ్ పోస్టర్.. నేను అలల కంటే మొండివాడిని అంటోన్న శర్వా
శర్వానంద్, సిద్ధార్థ్‌లు హీరోలుగా ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న క్రేజీ మల్టీస్టారర్ చిత్రం మహా సముద్రం. అదితీ రావు హైదారీ, అనూ ఇమ్మాన్యుల్‌లు ఇందులో హీరోయిన్లుగా కనిపిస్తున్నారు.
Maha Samudram Theme Poster: శర్వానంద్, సిద్ధార్థ్‌లు హీరోలుగా ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న క్రేజీ మల్టీస్టారర్ చిత్రం ‘మహా సముద్రం’. అదితీ రావు హైదారీ, అనూ ఇమ్మాన్యుల్‌లు ఇందులో హీరోయిన్లుగా కనిపిస్తున్నారు. ఇవాళ దీపావళి సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన థీమ్ పోస్టర్‌ని టీమ్ విడుదల చేసింది. (రూమర్లకు మరోసారి చెక్ పెట్టిన సుమ.. నువ్వే నా బలం, సంతోషమంటూ)
అందులో సముద్రం, గన్‌పై అమ్మాయి, అబ్బాయి.. రైలు వైపు దూసుకుపోతున్న మరో వ్యక్తి ఉన్నారు. ఈ పోస్టర్‌ని తన సోషల్ మీడియాలో షేర్ చేసిన శర్వానంద్.. నేను అలల కంటే మొండివాడిని, సముద్రం కంటే లోతైన వాడిని.. మరి మీరెవు అంటూ అదితీ, సిద్ధారథ్, అనూ ఇమ్మాన్యుల్‌లను ప్రశ్నించారు. (మీరే దేశానికి వెలకట్టలేని ఆస్తి.. చిన్నారులకు సీఎం జగన్ బాలల దినోత్సవం శుభాకాంక్షలు)
కాగా భావోద్వేగంతో కూడిన కథగా మహా సముద్రం తెరకెక్కుతోంది. ఇందులో శర్వా నెగిటివ్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ మూవీకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుండగా.. అభిమానుల్లో మహాసముద్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. (మావటితో మాట్లాడుతున్న శ్రీరంగం దేవాలయం ఏనుగు.. వీడియో వైరల్.. వావ్ అంటోన్న నెటిజన్లు)
I'm stubborn than the waves, deep as the seas! @aditiraohydari @Actor_Siddharth @ItsAnuEmmanuel Who are you? #MahaSamudram #ThemePoster ? #HappyDiwali ?@DirAjayBhupathi @AnilSunkara1 @AKentsOfficial pic.twitter.com/MGHfjfaFb8
— Sharwanand (@ImSharwanand) November 14, 2020