ఎన్టీఆర్‌ సరసన కీర్తి సురేష్‌.. క్రేజీ పెయిర్‌ని సెట్‌ చేస్తోన్న మాటల మాంత్రికుడు..!

టాలీవుడ్‌లో మరో క్రేజీ పెయిర్ జోడీ కట్టబోతుందా..? అన్నీ కుదిరితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన మహానటి కీర్తి సురేష్ నటించనుందా..?

ఎన్టీఆర్‌ సరసన కీర్తి సురేష్‌.. క్రేజీ పెయిర్‌ని సెట్‌ చేస్తోన్న మాటల మాంత్రికుడు..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 14, 2020 | 1:09 PM

NTR Keerthy Suresh: టాలీవుడ్‌లో మరో క్రేజీ పెయిర్ జోడీ కట్టబోతుందా..? అన్నీ కుదిరితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన మహానటి కీర్తి సురేష్ నటించనుందా..? అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి ఫిలింనగర్‌లో. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్‌లో నటిస్తోన్న ఎన్టీఆర్.. ఆ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మరోసారి నటించబోతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో మిగిలిన పాత్రాధారుల కోసం త్రివిక్రమ్ వెతుకులాట మొదలుపెట్టారు. (కరోనాతో మృతి చెందిన భారతీయ సంతతి డాక్టర్‌.. నివాళులు అర్పించనున్న లండన్ ఆసుపత్రి)

ఈ క్రమంలో ఈ మూవీలో హీరోయిన్‌గా పలువురి పేర్లు వినిపించాయి. పూజా హెగ్డే, జాన్వీ కపూర్‌.. ఇలా పలువురు త్రివిక్రమ్ మనసులో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ కోసం త్రివిక్రమ్‌, కీర్తిని సంప్రదించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇందులో నటించేందుకు కీర్తి ఒప్పుకుంటే.. మరో క్రేజీ పెయిర్‌ని చూసే అవకాశం సినీ ప్రేక్షకులకు లభిస్తుంది. కాగా గతంలో పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన అఙ్ఞ్యాతవాసిలో కీర్తి సురేష్‌ నటించారు. అయితే ఈ సినిమా భారీ పరాజయమైన విషయం తెలిసిందే. (ఇంట్రస్టింగ్‌గా ‘మహా సముద్రం’ థీమ్‌ పోస్టర్‌.. నేను అలల కంటే మొండివాడిని అంటోన్న శర్వా)