Telugu News » Latest news » Bjp mp tg venkatesh sensational comments on ap govt about capital of ap
ఏపీకి 4 రాజధానులు.. సీఎం జగన్ ఆలోచన చెప్పిన బీజేపీ ఎంపీ
TV9 Telugu Digital Desk | Edited By:
Updated on: Aug 26, 2019 | 2:24 AM
బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ ఏపీ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ రాజధాని అమరావతిని సాగనీయబోమని కేంద్రంతో జగన్ చెప్పారన్నారు. రాష్ట్రంలో నాలుగు రాజధానులు పెట్టే ఆలోచనలో జగన్ ఉన్నారని తెలిపారు వెంకటేశ్. మరోవైపు ఆయన మాట్లాడుతూ జగన్ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చూస్తున్నారని అదే గనుక చేస్తే ప్రజలంతా ఆనందిస్తారన్నారు. అమరాతిని ఫ్రీజోన్‌గా చేయాలని గతంలో అడిగామని చెబుతూ అలా చేయకపోవడం, అమరావతిపైనే దృష్టిపెట్టడం వల్ల టీడీపీ […]
Follow us on
బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ ఏపీ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ రాజధాని అమరావతిని సాగనీయబోమని కేంద్రంతో జగన్ చెప్పారన్నారు. రాష్ట్రంలో నాలుగు రాజధానులు పెట్టే ఆలోచనలో జగన్ ఉన్నారని తెలిపారు వెంకటేశ్. మరోవైపు ఆయన మాట్లాడుతూ జగన్ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చూస్తున్నారని అదే గనుక చేస్తే ప్రజలంతా ఆనందిస్తారన్నారు. అమరాతిని ఫ్రీజోన్‌గా చేయాలని గతంలో అడిగామని చెబుతూ అలా చేయకపోవడం, అమరావతిపైనే దృష్టిపెట్టడం వల్ల టీడీపీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు వికేంద్రీకరణ జరగాలని ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు టీజీ వెంకటేశ్.