AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీ యాక్షన్ ప్లాన్: జూన్ అంతా అదే ఇష్యూ

తెలంగాణవ్యాప్తంగా భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించేందుకు రెడీ అవుతోంది బీజేపీ. ఇందుకోసం జూన్ మాసం మొత్తం ఒకే అంశం ఆధారంగా ఉద్యమాలను నిర్వహించాలని...

బీజేపీ యాక్షన్ ప్లాన్: జూన్ అంతా అదే ఇష్యూ
Rajesh Sharma
|

Updated on: May 27, 2020 | 4:22 PM

Share

Telangana BJP finalising action plan for June month: తెలంగాణవ్యాప్తంగా భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించేందుకు రెడీ అవుతోంది బీజేపీ. ఇందుకోసం జూన్ మాసం మొత్తం ఒకే అంశం ఆధారంగా ఉద్యమాలను నిర్వహించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. కేసీఆర్ ప్రభుత్వ విధానాల్లో లోపాలను, ప్రభుత్వ తప్పిదాలను ప్రజలకు వివరించేందుకు నెల రోజుల పాటు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాలని తెలంగాన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ నిర్ణయించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సమగ్ర వ్యవసాయ విధానంపై యాక్షన్ ప్లాన్ సిద్దం చేసింది బీజేపీ. వచ్చే నెల జూన్ మొత్తం రైతాంగ సమస్యలే ప్రధాన ఎజెండాగా పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కోర్ కమిటీలో చర్చించిన తర్వాత త్వరలో నిర్ణయం వెలువరించే అవకాశాలున్నాట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెలలో చేసే కార్యక్రమాలపై పార్టీ ముఖ్య నేతల సలహాలు తీసుకుంటున్నారు అధ్యక్షుడు బండి సంజయ్.

సమగ్ర వ్యవసాయ విధానంలో ఉన్న ఇబ్బందులు, లోటుపాట్లను రైతులకు వివరించేందుకు కర పత్రల పంపిణీ, రైతు సదస్సులు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ భావిస్తున్నారు. ఇందుకోసం బీజేపీ సీనియర్ల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో సీనియర్లతో భేటీ అయ్యాక జూన్ నెల యాక్షన్ ప్లాన్‌ను ఖరారు చేస్తారని సమాచారం.