కరోనాతో కన్నీరు పెడుతున్న ఉల్లి రైతు

లాక్‌డౌన్ అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేస్తోంది. వ‌ల‌స కూలీలు, కార్మికులు, ప్రైవేటు సంస్థ‌ల్లో ప‌నిచేసే ఉద్యోగులు, రవాణా వ్యవస్థ, కుటీర పరిశ్రమలు ఇలా ప్ర‌తి ఒక్క‌రూ లాక్‌డౌన్ తో తీవ్రంగా ప్ర‌భావిత‌మ‌య్యారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో వ్యవసాయం రంగాన్ని కూడా వదలలేదు. ముఖ్యంగా ఉద్యాన పంట‌లు వేసిన రైతులను కూడా లాక్‌డౌన్ దెబ్బ‌తీసింది. తాజాగా ఉల్లి రైతును విల‌విల్లాడేలా చేస్తోంది లాక్‌డౌన్. రాజ‌స్థాన్, మ‌హారాష్ట్ర‌ల్లో ఉల్లి పంట వేసిన రైతు తీవ్ర న‌ష్టాలు మూటగ‌ట్టుకుంటున్నారు. […]

కరోనాతో కన్నీరు పెడుతున్న ఉల్లి రైతు
Follow us

|

Updated on: May 27, 2020 | 4:13 PM

లాక్‌డౌన్ అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేస్తోంది. వ‌ల‌స కూలీలు, కార్మికులు, ప్రైవేటు సంస్థ‌ల్లో ప‌నిచేసే ఉద్యోగులు, రవాణా వ్యవస్థ, కుటీర పరిశ్రమలు ఇలా ప్ర‌తి ఒక్క‌రూ లాక్‌డౌన్ తో తీవ్రంగా ప్ర‌భావిత‌మ‌య్యారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో వ్యవసాయం రంగాన్ని కూడా వదలలేదు. ముఖ్యంగా ఉద్యాన పంట‌లు వేసిన రైతులను కూడా లాక్‌డౌన్ దెబ్బ‌తీసింది. తాజాగా ఉల్లి రైతును విల‌విల్లాడేలా చేస్తోంది లాక్‌డౌన్. రాజ‌స్థాన్, మ‌హారాష్ట్ర‌ల్లో ఉల్లి పంట వేసిన రైతు తీవ్ర న‌ష్టాలు మూటగ‌ట్టుకుంటున్నారు. లాక్‌డైన్‌వ‌ల్ల హోట‌ళ్లు, రెస్టారెంట్లు మూత‌ప‌డ‌టం, వివాహాది శుభ‌కార్యాలు నిలిచిపోవ‌డం ఉల్లి డిమాండ్ పూర్తిగా తగ్గింది. దీంతో కనీసం మద్దుతు ధర లభించడంలేదు. లాక్‌డౌన్ కి ముందు రూ.20 నుంచి 25 మ‌ధ్య ప‌లికిన ఉల్లి ధ‌రలు ఇప్పుడు రూ.10 దిగువ‌కు ప‌డిపోయాయి. చేసిన కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించడంలేదు. కనీసం ప్రయాణ ఖర్చులు మిగలడం లేదు. దీంతో ఉల్లిని రోడ్లపై పారేసుకుంటున్నారు. ప్రభుత్వాలే ఉల్లిని కొనుగోలు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు.

Latest Articles