చనిపోయిన వ్యక్తి డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించిన బ్యాంక్ సిబ్బంది.. మృతదేహన్నే తీసుకువచ్చిన గ్రామస్తులు..

చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామస్తులు.. బ్యాంకుకు వెళ్లి అతని ఖాతాలోని డబ్బులు కావాలని సిబ్బందిని కోరారు..

చనిపోయిన వ్యక్తి డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించిన బ్యాంక్ సిబ్బంది.. మృతదేహన్నే తీసుకువచ్చిన గ్రామస్తులు..
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 06, 2021 | 4:15 PM

బీహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. బ్యాంకులోని డబ్బుల కోసం చనిపోయిన వ్యక్తిని తీసుకువచ్చారు బంధువులు. రాష్ట్ర రాజధాని పాట్నా పరిధిలోగల ఒక గ్రామంలో విచిత్ర ఉదంతం వెలుగుచూసింది. బ్యాంకు ఖాతాలోని డబ్బుల కోసం ఒక మృతుడు రావడంతో బ్యాంకు సిబ్బంది హడలెత్తిపోయారు. పాట్నా నగరానికి సమీపంలోని షాజహాన్‌పూర్ పరిధిలోని సిగరియావా గ్రామంలో ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న కెనరా బ్యాంకు బ్రాంచిలో అదే సిగరియావా గ్రామానికి చెందిన మహేష్ యాదవ్(55)కు ఖాతా ఉంది. అతనికి సంబంధించి సొమ్మును అందులో జమ చేస్తూ ఉంటాడు. కాగా, ఇటీవల అనారోగ్యం కారణంగా మహేష్ యాదవ్ మృతి చెందాడు. అతని అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామస్తులు బ్యాంకుకు వెళ్లి అతని ఖాతాలోని డబ్బులు కావాలని సిబ్బందిని అడిగారు. అయితే, డబ్బులు ఇచ్చేందుకు బ్యాంకు మేనేజర్ నిరాకరించారు.

దీంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తూ మహేష్ యాదవ్ మృతదేహాన్ని నేరుగా బ్యాంకులోకి తీసుకువచ్చారు. దీనిని చూసిన బ్యాంకు సిబ్బంది కంగారుకు గురయ్యారు. మూడు గంటలపాటు మహేష్ మృతదేహన్ని బ్యాంకులోనే ఉంచి నిరసన తెలిపారు. బ్యాంకు మేనేజర్ ఎంత నచ్చజెప్పినా గ్రామస్తులు ససేమిరా అన్నారు. దీంతో చేసేదేమీ లేక బ్యాంకు మేనేజరు తన జేబులోని రూ. 10 వేలు తీసి, వారికిచ్చి శాంతపరిచారు. ఆ సొమ్ముతో గ్రామస్తులు మహేష్ యాదవ్ మృతదేహనికి అంత్యక్రియలు నిర్వహించారు. మహేష్‌కు వివాహం కూడా కాలేదు. పైగా అతనికి బంధువులెవరూ లేరు. అతని బ్యాంకు ఖాతాలో లక్ష రూపాయలకుపైగా మొత్తం ఉంది. అయితే, అతని బ్యాంకు ఖాతాకు నామినీ ఎవరూ లేరు. ఈ కారణంగానే బ్యాంకు మేనేజర్ అతని సొమ్ము ఇవ్వడానికి నిరాకరించారు. బ్యాంకు మేనేజర్ ఇచ్చిన సొమ్ముతో గ్రామస్తులే మహేష్ యాదవ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

కెనరా బ్యాంక్ మేనేజర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ గ్రామస్తులు మహేష్ డబ్బులు తీసుకోవడానికి వచ్చారని చెప్పారు. దహన సంస్కారాలకు డబ్బు అవసరం. కానీ బ్యాంకుకు ఒక ప్రక్రియ ఉంది. అందుకే అతను డబ్బులు చెల్లించలేడు. అతని ఖాతాలో నామినీ లేరు. మృతుడికి కూడా కెవైసి లేదు. అతని మరణం ధృవపత్రాలు వచ్చినప్పుడు, అతని హక్కుదారునికి మాత్రమే డబ్బు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

Prayer for Mother : చనిపోయిన తల్లి బతకాలంటూ పిల్లల ప్రార్థనలు… 22 రోజులుగా మృతదేహం వద్దే…