Changes in the VRA System: వీఆర్ఏ వ్యవస్థలో కీలక మార్పులు.. వ్యవసాయ శాఖకు బదాలాయింపులు? ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందంటే..

Changes in the VRA System: రెవెన్యూ శాఖను ప్రభుత్వం ప్రక్షాళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీఆర్వో వ్యవస్థను రద్దుచేసి ప్రభుత్వం సంచలన నిర్ణయం

Changes in the VRA System: వీఆర్ఏ వ్యవస్థలో కీలక మార్పులు.. వ్యవసాయ శాఖకు బదాలాయింపులు? ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందంటే..
Follow us
uppula Raju

|

Updated on: Jan 06, 2021 | 4:03 PM

Changes in the VRA System: రెవెన్యూ శాఖను ప్రభుత్వం ప్రక్షాళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీఆర్వో వ్యవస్థను రద్దుచేసి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు వీఆర్‌ఏలను కూడా వ్యవసాయ శాఖకు అనుసంధానించాలని చూస్తోంది. ఇందుకోసం కసరత్తు కూడా ప్రారంభించింది. అయితే అనాధిగా రెవెన్యూ శాఖలో కీలకంగా పనిచేస్తున్న తమను ఇతర శాఖలకు బదాలాయించడం అన్నాయమని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీఆర్ఏలు కోరుతున్నారు.

అయితే వీఆర్‌ఏ ఉద్యోగుల్లో రెండు వర్గాలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. ఒక వర్గం డైరెక్ట్ రిక్రూట్ మెంట్ కాగా రెండో వర్గం కారుణ్య నియామకాలు, అనాధిగా రెవెన్యూ శాఖను అంటిపెట్టుకొని పనిచేస్తున్న వారు. ఇందులో డైరెక్ట్‌గా ఎంపికైన వారు తమకు ఒక వ్యవసాయ శాఖ కాకుండా ఇతర శాఖలలో కూడా అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరో వర్గం తాము ఏ శాఖకు వెళ్లమని తమని రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని ముక్తకంఠంతో కోరుతున్నారు. వీఆర్‌ఏ డైరెక్ట్ రిక్రూట్ మెంట్ లో ఎంపికైన వారు కొంతమంది ఉన్నత విద్యావంతులు కూడా ఉన్నారు. వారు మాకు అన్యాయం చేయొద్దని జూనియర్ అసిస్టెంట్‌గా ఇతర శాఖల్లోకి తమని తీసుకోవాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

పీసీపీ చీఫ్‌ ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠ.. సాగర్ ఉప ఎన్నిక వరకు పెండింగ్.. అధిష్ఠానం ఎందుకు ఇలా చేస్తోందంటే..