KGF-2 Movie Rights: కేజీఎఫ్-2 సినిమా హక్కులను సొంతం చేసుకున్న హీరో కమ్ చిత్రనిర్మాత.. ఎవరంటే ?
సరికొత్త యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన్న కేజీఎఫ్ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురింపించింది. అంతే కాకుండా పాన్ ఇండియా లెవల్లో విడుదలయిన
సరికొత్త యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన్న కేజీఎఫ్ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురింపించింది. అంతే కాకుండా పాన్ ఇండియా లెవల్లో విడుదలన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ప్రస్తుతం దానికి సిక్వెల్‌గా కేజీఎఫ్-2 చిత్రం రూపొందుతోంది. కేజీఎఫ్ సినిమాతో జాతీయ స్థాయి డైరెక్టర్‍గా గుర్తింపు పొందాడు ప్రశాంత్ నీల్. భారీ యాక్షన్ సినిమాపై దేశవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు ఆ చిత్రబృందాన్ని ప్రశంసించారు. ప్రస్తుతం కేజీఎఫ్-2 మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీకి సంబంధించిన కేరళ హక్కులను మలయాళ హీరో కమ్ చిత్ర నిర్మాత పృథ్వీ రాజ్ భారీ మొత్తంతో కొనుగోలు చేశారట. ఈ విషయాన్ని పృథ్వీరాజ్ తన ట్వీట్టర్ ద్వారా తెలిపాడు. అందులో “నేను కేజీఎఫ్ సిరీస్‌కు పెద్ద అభిమానిని. లుసీఫర్ తర్వాత నన్ను సంప్రదించిన సంస్థ హంబలే ఫిల్మ్స్ మొదటిది. నేను కేజీఎఫ్ -2 కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. దేశవ్యాప్తంగా ఎదురుచూసే కేజీఎఫ్ -2 మూవీ రైట్స్‌ను చాలా గర్వంగా ఉంది. పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ కేజీఎఫ్-2ను హక్కులను తీసుకోవడం చాలా గర్వంగా ఉంది.. నేను కూడా రాకీభాయ్ను చూడటానికి ఎంతగానో ఎదురుచూస్తున్నాను” అంటూ ట్వీట్ చేశాడు.
పృథ్వీరాజ్ ట్వీట్..
KGF 2. Prithviraj Productions is proud to present KGF 2. Like millions of you..I too am waiting to see Rocky’s tale unfold! ? @PrithvirajProd @hombalefilms @VKiragandur @TheNameIsYash @prashanth_neel @duttsanjay #Karthik #KGFChapter2 @PrithviOfficial pic.twitter.com/tC4uAESkI1
— Prithviraj Productions (@PrithvirajProd) January 4, 2021
Also Read:
Salman Khan: భారీ బడ్జెట్‌తో సల్మాన్ ఖాన్ రాధే మూవీ హక్కులను సొంతం చేసుకున్న జీ స్టూడియోస్..