Megastar chiranjeevi: సీఐ శ్యాం సుందర్‏కి సెల్యూట్ చెప్పిన చిరంజీవి.. అతడి కళ్ళలో గర్వాన్ని చూశానంటూ..

తన కూతురు తనకంటే పెద్ద హోదాలో ఉండడంతో ఆ తండ్రి కళ్ళలో సంతోషం కనిపించింది. సీఐ హోదాలో ఉన్న శ్యాం సుందర్..

Megastar chiranjeevi: సీఐ శ్యాం సుందర్‏కి సెల్యూట్ చెప్పిన చిరంజీవి.. అతడి కళ్ళలో గర్వాన్ని చూశానంటూ..
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 06, 2021 | 3:03 PM

తన కూతురు తనకంటే పెద్ద హోదాలో ఉండడంతో ఆ తండ్రి కళ్ళలో సంతోషం కనిపించింది. సీఐ హోదాలో ఉన్న శ్యాం సుందర్.. డిఎస్టీ హోదాలో వచ్చిన తన కూతురికి సెల్యూట్ చేస్తున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది. తిరుపతిలో నిర్వహించిన పోలీస్ ట్యూటీ మీట్ 2021 కార్యక్రమంలో భాగంగా ఈ దృశ్యం కనిపించింది. కూతురికి తండ్రి సెల్యూట్ చేసే ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు పుల రకాలుగా స్పందించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు.

ఆ ఫోటోను మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ.. “ఆ ఫోటోలో ఉన్నది తండ్రి సీఐ శ్యాం సుందర్ గారు, కూతురు డీఎస్పీ జెస్సీ ప్రశాంతి. తన గుండెల మీద ఎత్తుకుని పెంచిన బిడ్డ, తనపై అధికారిగా వచ్చినప్పుడు ఆ తండ్రి చేసిన సెల్యూట్‏లో బోల్డెంత్ సంతృప్తిని, గర్వాన్ని, ప్రేమని చూసాను. శ్యాంసుందర్ గారు సెల్యూట్. మీ ఇద్దరు ఇంకెందరికో స్పూరి ” అంటూ ట్వీట్ చేశారు.

చిరంజీవి ట్వీట్..

Also Read:

Raviteja: క్రాక్ సినిమాతో సంక్రాంతికి విందు భోజనం.. అభిమానులకు రవితేజ విజ్ఞప్తి..