నేను రాలేదు కానీ నా వాయిస్ వచ్చింది : నందు

న‌టుడు నందు బిగ్‌బాస్‌లోకి వెళ్తున్నాడ‌నుకున్న అభిమానులు నిరుత్సాహ‌ప‌డ్డారు. అయితే, తన వాయిస్ బీబీ 4 హౌస్ లో వినిపించేలా చేసి వారికి కాస్త ఊరటనిచ్చాడు. గురువారం అవినాష్ వైల్డ్ కార్డు ఎంట్రీ సందర్భంగా ప్రొమో కోసం నందు తన వాయిస్ వినిపించాడు.

  • Balaraju Goud
  • Publish Date - 5:37 pm, Fri, 18 September 20
నేను రాలేదు కానీ నా వాయిస్ వచ్చింది : నందు

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 4లో వెల్డ్ కార్డు ఎంట్రీతో కొత్త వ్యక్తి ఎంటర్ అవుతున్నాడంటూ వాయిస్ ఓవర్ లో సందడి చేసింది. న‌టుడు నందు బీబీ కమింగ్ సూన్ అంటూ ర‌చ్చ చేశాడు. దీంతో అత‌డు బిగ్‌బాస్‌లో అడుగు పెట్ట‌బోతున్నాడ‌ని అంతా అనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా బీబీ అంటే “బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్” అని త‌న త‌ర్వాతి సినిమా టైటిల్‌ను వెల్ల‌డించాడు. దీంతో అత‌డు బిగ్‌బాస్‌లోకి వెళ్తున్నాడ‌నుకున్న అభిమానులు నిరుత్సాహ‌ప‌డ్డారు. అయితే, తన వాయిస్ బీబీ 4 హౌస్ లో వినిపించేలా చేసి వారికి కాస్త ఊరటనిచ్చాడు. గురువారం అవినాష్ వైల్డ్ కార్డు ఎంట్రీ సందర్భంగా ప్రొమో కోసం నందు తన వాయిస్ వినిపించాడు.

అతడు హౌస్ కు రాక‌పోయినా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన‌ ముక్కు అవినాష్ ఏవీకి వాయిస్ ఓవ‌ర్ ఇచ్చాడు నందు. అవినాష్ లైఫ్ జ‌ర్నీకి సంబంధించిన ఈ ప్రోమోలో అత‌డి బాల్యం నుంచి య‌వ్వ‌నం వ‌ర‌కు ప‌డ్డ‌ క‌ష్టన‌ష్టాల‌ను గురించి వివ‌రంగా చెప్పుకొచ్చాడు. ఈ విష‌యాన్ని నందు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. నేను చాలా ఇష్ట‌ప‌డే డైరెక్ట‌ర్‌, నా స్నేహితుడు అవినాష్ కోసం వాయిస్ ఓవ‌ర్ చెప్పాను. బీబీ, బీబీ అని చెప్పినందుకు చివ‌రికి ఇలానైనా నా వాయిస్ బిగ్‌బాస్‌ 4లో వినప‌డినందుకు సంతోషంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు. కాగా అవినాష్ ఇంట్లోకి వ‌చ్చిన తొలిరోజే అంద‌రితో క‌లిసిపోయాడు. గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అవినాష్‌ను ఇంటి స‌భ్యులు కూడా బాగానే ఆటాడు‌కున్నారు. జోకర్ గా బీబీ 4 లోకి ఎంట్రీ ఇచ్చిన అవినాష్ కామెడీ స్కిట్లతో ఏమేరకు వినోదాన్ని పండిస్తాడో వేచిచూద్దాం…