AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రహ్మోత్సవాలను గుడి ప్రాకారం లోపలే…

దేవదేవుడి సాలకట్ల బ్రహ్మోత్సవాల కోసం తిరుమల గిరులు ముస్తాబవుతున్నాయి. అయితే కలియుగ వైకుంఠంలో శ్రీవారి ఉత్సవాలను కనులారా తిలకించేందుకు వడివడిగా తిరుమల గిరులు చేరుకునేవారికి కరోనా బ్రేకులు వేసింది.

బ్రహ్మోత్సవాలను గుడి ప్రాకారం లోపలే...
Sanjay Kasula
|

Updated on: Sep 18, 2020 | 6:14 PM

Share

దేవదేవుడి సాలకట్ల బ్రహ్మోత్సవాల కోసం తిరుమల గిరులు ముస్తాబవుతున్నాయి. అయితే కలియుగ వైకుంఠంలో శ్రీవారి ఉత్సవాలను కనులారా తిలకించేందుకు వడివడిగా తిరుమల గిరులు చేరుకునేవారికి కరోనా బ్రేకులు వేసింది.

ఈ ఏడాది కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో జనరద్దీని కట్టడి చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రత్యేక చర్యలు చేపట్టింది.బ్రహ్మోత్సవాలను గుడి ప్రాకారం లోపలే నిర్వహించాలని తలపెట్టింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలపై టీటీడీ చైర్మన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఏకాంతంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు అన్నీ ఏర్పాట్లు చేశామన్నారు.

శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవ మండపంలో ఏకాంతంగా వాహనసేవలు నిర్వహిస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ ఉత్సవాలను ఎస్వీబీసీ (SVBC)లో వాహనసేవలను ప్రత్యక్ష ప్రసారం చేస్తాయనున్నామన్నారు. ఈ నెల 23న గరుడవాహనం రోజు ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారని అన్నారు. గతంలో గరుడవాహనం రోజు రాష్ట్ర ప్రభుత్వం పట్టు వస్త్రాలు సమర్పించేది.. అయితే భద్రతా కారణాల దృష్ట్యా 13ఏళ్లుగా ధ్వజారోహణం రోజు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. ప్రస్తుతం బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్న కారణంగా సీఎం జగన్ గరుడసేవరోజు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఆయన తెలిపారు.

ఈనెల 24 కర్నాటక సత్రం నూతన భవన నిర్మాణానికి భూమిపూజ జరుగుతుందని పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్, కర్ణాటక సీఎం యడ్యూరప్ప భూమిపూజలో పాల్గొంటారని తెలిపారు టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి

ఇదిలావుంటే… టీటీడీ ప్రతి ఏటా ప్రచూరించే డైరీల సంఖ్యను తగ్గించామని సోషియల్ మీడియాలో ప్రచారం జరుగుతోందన్నారు టీటీడీ ఈఓ అనిల్ సింఘాల్. కరోనా కారణంగానే భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని 25శాతంకు కుదించామని అన్నారు. పారదర్శకత కోసమే టీటీడీని కాగ్ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించామని గుర్తు చేశారు. లాక్‌డౌన్ గైడ్ లైన్స్ దృష్టిలో పెట్టుకుని శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కళ్యాణోత్సవ మండపం వద్ద క్యూలైన్లలో వాహనసేవలు వీక్షించాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని టీటీడీ ఈఓ అనిల్ సింఘాల్ అన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
ఓ వైపు ఏలియన్స్‌, మరో వైపు ముంచుకొస్తున్న AI ..దడ పుట్టిస్తున్న
ఓ వైపు ఏలియన్స్‌, మరో వైపు ముంచుకొస్తున్న AI ..దడ పుట్టిస్తున్న