ఉత్తమ్ కాల్ డేటా లోగుట్టు..! బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు అయ్యాయా?

ఉత్తమ్ కాల్ డేటా లోగుట్టు..!  బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు అయ్యాయా?

హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో గెలుపు మాదంటే మాదంటూ ఇటు అధికార టీఆర్ఎస్, అటు కాంగ్రెస్ పార్టీలు ధీమాతో ఉన్నాయి. మూడు పార్టీల నేతలు గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తుండగా ..టీఆర్ఎస్ పార్టీ. ఆసక్తికరమైన ఆరోపణ చేసింది. కాంగ్రెస్, బీజేపీల నేతలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారంటూ గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇది కేవలం రాజకీయంగా చేస్తున్న ఆరోపణా? లేక టీఆర్ఎస్ నేతలు ఆడుతున్న మైండ్ గేమ్‌లో భాగమా? ఇదే అంశంపై టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌ […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 17, 2019 | 11:00 PM

హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో గెలుపు మాదంటే మాదంటూ ఇటు అధికార టీఆర్ఎస్, అటు కాంగ్రెస్ పార్టీలు ధీమాతో ఉన్నాయి. మూడు పార్టీల నేతలు గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తుండగా ..టీఆర్ఎస్ పార్టీ. ఆసక్తికరమైన ఆరోపణ చేసింది. కాంగ్రెస్, బీజేపీల నేతలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారంటూ గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇది కేవలం రాజకీయంగా చేస్తున్న ఆరోపణా? లేక టీఆర్ఎస్ నేతలు ఆడుతున్న మైండ్ గేమ్‌లో భాగమా? ఇదే అంశంపై టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌ లైవ్ షో లో ఆసక్తికరమైన చర్చ జరిగింది. టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ నిర్వహించిన ఈ లైవ్ షోలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, టీఆర్ఎస్ పార్టీ నుంచి మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు.

టీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్నట్టుగా తమకు బీజేపీతో కుమ్మక్కు కావాల్సిన అవసరం లేదన్నారు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. పైగా పార్లమెంట్‌లో ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 వంటి బిల్లులు ప్రవేశపెట్టిన సందర్భంలో టీఆర్ఎస్ ఎంపీలు బీజేపీతో కలిసిపోయిన విషయం అందరికీ తెలిసిందేనని ప్రత్యారోపణ చేశారు. తమకు బీజేపీకి సైంద్ధాంతిక విభేదాలున్నాయని తెలిపారు ఉత్తమ్.

ఇక ఇదే విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అవుతుంటే ఉత్తమ్ కనీసం ఆపలేకపోయారని విమర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న ఉపఎన్నికకు కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు. తాము నాలుగు పార్లమెంట్ సీట్లలో ఒంటరిగానే పోటీచేసి గెలిచామని, తమకు ఎవరి సపోర్టు లేదన్నారు లక్ష్మణ్. పైగా కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు వేరు కాదని, ఒకవేళ కాంగ్రెస్ గెలిచినా అది టీఆర్ఎస్‌కే లాభం అనే విషయం ప్రజలకు అర్ధమైందని ఆయన ఆరోపించారు. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా హుజూర్‌నగర్‌లో విజయం సాధించబోతుందని, తమ గెలుపును అడ్డుకునేందుకు ఉత్తమ్, లక్ష్మణ్‌లు ప్రయత్నిస్తున్నారని మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ప్రతిరోజు ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకుంటూనే ఉన్నారనే సమాచారముందన్నారు. ఉత్తమ్ కుమార్ అధికారులపై ఫిర్యాదు చేసిన చేసిన ప్రతి కాపీ లక్ష్మణ్ దగ్గర ఉంటుందన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలిద్దరూ కలిసి కుమ్మక్కయ్యారనడానికి ఎన్నో ఉదాహరణలున్నాయంటూ ఆరోపించారు జగదీశ్‌రెడ్డి. వీరిద్దరి కాల్ డేటా బయటపెడితే అన్ని విషయాలు బయటికొస్తాయంటూ సవాల్ చేశారు.

మరో 48 గంటల్లో హుజూర్‌నగర్ ఉపఎన్నికల ప్రచారం ముగియనుండగా ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడంలో బిజీగా మారిపోయారు. ఇక 21తేదీన పోలింగ్ జరగనుండగా ఏపార్టీకి ఓటర్లు పట్టం కడతారో అని అనేది ఆసక్తిగా మారింది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu