అనుకున్నదే అయింది… 9కోట్ల మంది ప్రమాదంలో ఉన్నారా?

ఇండియాలో పరిస్థితి చేజారిపోతోందా? కరోనాను నియంత్రించడం అసాధ్యమా? మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడులో అదుపు తప్పింది. తెలుగురాష్ట్రాల్లో వందల సంఖ్యలో కేసులొస్తున్నాయి. మొత్తానికి ఇండియా ప్రపంచంలో ఆరో ప్లేస్‌లో ఉంది.

అనుకున్నదే అయింది... 9కోట్ల మంది ప్రమాదంలో ఉన్నారా?
Follow us

|

Updated on: Jun 09, 2020 | 10:28 PM

కరోనా కట్టడి అసాధ్యమా? సహజీవనానికి సిద్దమవ్వాల్సిందేనా? టెస్టులు చేయకుండా కేసులు తక్కువ చూపిస్తే ప్రయోజనమేంటి?

ఇండియాలో పరిస్థితి చేజారిపోతోందా? కరోనాను నియంత్రించడం అసాధ్యమా? మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడులో అదుపు తప్పింది. తెలుగురాష్ట్రాల్లో వందల సంఖ్యలో కేసులొస్తున్నాయి. మొత్తానికి ఇండియా ప్రపంచంలో ఆరో ప్లేస్‌లో ఉంది. చూస్తుంటే టాప్‌5 చేరుకోవడానికి ఇంకెన్నో గంటలు పట్టదు. మొదట్లో దీనికి లాక్‌డౌనే మందు అని అన్నీ దేశాలు భావించాయి. కానీ నెలల పాటు లాక్‌డౌన్‌ను పొడిగించుకుంటూ పోయినా… వైరస్‌ ఏమాత్రం కంట్రోల్‌లోకి రాలేదు.

ఎక్కడో చైనా, ఇటలీలో విస్తరిస్తుంటే భయంతో అప్రమత్తమయ్యాం. తీరా ఇండియాలో కరాళనృత్యం చేస్తుంటే చేతులెత్తేశామా? ప్రస్తుతం ఢిల్లీలో 30వేల కేసులున్నాయి.. ఈ నెలాఖరుకు లక్ష… జులై చివర్లో 5లక్షలకు చేరుతుందని ప్రభుత్వమే ప్రకటిస్తోంది. ఇక 88వేల పాజిటివ్‌ రిపోర్ట్‌ అయిన మహారాష్ట్రలో బీమారీ వ్యాప్తిని ఆపతరమా?. 76 రోజులు లాక్‌డౌన్‌ అమలుచేసినా సాధించిన ఫలితం ఏంటన్నది ఇప్పుడు చర్చగా మారింది. కరోనా తీవ్రతను పోస్ట్‌పోన్‌ చేశాం కానీ.. కట్టడి చేయలేకపోయమన్నదే నిజమవుతోంది. నెలరోజుల క్రితం కరోనాను భారత్‌ ధీటుగా ఎదుర్కొందని ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థే ఇప్పుడు కట్టడి చేయడం అసాధ్యమంటోంది. దక్షణాసియాలో ముఖ్యంలో ఇండియాలో భయానకంగా ఉంటుందని హెచ్చరిస్తోంది. 660 కేసులుండగా ఫస్ట్‌ లాక్‌డౌన్‌ అమల్లోకి రాగా… రెండున్నర లక్షల కేసులున్నప్పుడు పూర్తిగా సడలింపులు ఇచ్చేసింది కేంద్రం. ప్రస్తుతం దేశంలో 2లక్షల 60వేల కేసులు నమోదుకాగా.. 7వేల 5వందల మంది బలయ్యారు. వాస్తవానికి ఈసంఖ్య ఇంకా ఎక్కువ ఉంటుందన్నది నిపుణులు వాదన. దేశంలో అత్యధికంగా కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో ప్రతీ పది లక్షల జనాభాకు… 4308 టెస్టులు మాత్రమే చేస్తున్నారు. అంటే టెస్టులు సంఖ్య పెంచితే అమెరికా పక్కన నిలబడినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు కొందరు. కేంద్రం మాత్రం ఇప్పటికీ కంట్రోల్‌లోనే ఉందంటోంది. అమెరికాలో మిలియన్‌లో 5వేల మందికి కరోనా ఉంటే… మనదగ్గర కేవలం 150 మాత్రమేనంటోంది నీతీఆయోగ్‌. మరణాలు రేటు 2.8శాతంగా చెబుతోంది. ఇదొక్కటే కాస్త ఊరటకలిగిస్తున్న అంశం. అటు తెలుగురాష్ట్రాల్లోనూ పరిస్థితి చేజారిపోతోంది. ఏపీలో 5వేలకు చేరువ అవుతోంది. మరణాల సంఖ్య కూడా వందకు దగ్గరగా ఉంది. ఇటు తెలంగాణలో కొత్తగా 4వేలకు చేరువలోనే ఉన్నాయి. మొత్తం మరణాలు 150 దగ్గరగా ఉంది. రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులకే కరోనా పాజిటివ్‌ రావడం ఆందోళన కలిగిస్తోంది. అటు తెలంగాణలో జరుగుతున్న టెస్టులు, ట్రీట్‌మెంట్‌పై కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. గాంధీకి వెళితే తిరిగివస్తారన్న నమ్మకం పోతుందని కోర్టు… మృతదేహాలకు కూడా పరీక్షలు చేయాల్సిందేనని ఆదేశించింది. అంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్ధమవుతోంది. కరోనా ఎక్కడో ఉందంటే భయపడిన దేశం… ఇప్పుడు మన పక్కకే వచ్చింది. నాయకులు చెప్పినట్టు మనం సహజీవనం స్థాయికి రావడానికి ఎంతోకాలం పట్టేట్టు లేదంటున్నాయి నివేదికలు. బిగ్‌ న్యూస్ బిగ్‌ డిబేట్‌లో ఏపీ అడిషనల్‌ చీప్‌ సెక్రటరీ స్పష్టత ఇచ్చారు… ప్రభుత్వాలు చేసేదేమీ లేదన్నారు. 25శాతం మాత్రమే బాధ్యత వహిస్తాయి. మిగిలినందంతా ఎవరికి వారు స్వీయ రక్షణ పాటించాల్సిందే అంటున్నారు. దీనికి ప్రస్తుతానికి మందు నిబ్బరమే అంటున్నారు. భయం లేకుండా జాగ్రత్తగా ఉంటే ఎలాంటి ప్రమాదం ఉండదని సూచిస్తున్నారు డాక్టర్‌ విష్ణున్‌రావు. బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌ లో పాల్గొన్న ఆయన… ఇతర వ్యాధులు ఉన్నవాళ్లే ఎక్కువ చనిపోతున్నారన్నారు. కరోనా ఎటాక్‌ అయితే… బాడాలో ఇమ్యూన్‌ పవర్‌ లేనివాళ్లకు.. ముఖ్యంగా వృద్దులకు ఇది ప్రమాదమంటున్నారు. దేశంలో 9 కోట్ల మంది మాత్రమే మరింత జాగ్రత్తగా ఉంటే సరిపోతుందన్నది ఆయన లెక్క. ఏది ఏమైనా ప్రభ/త్వాలు ఈ పరిస్థితుల్లో చేయగలిగింది ఏమీ లేదు… ప్రజలకు తమకు తాము స్వీయ క్వారంటైన్‌ పద్దులు అవలంభించడమే శ్రీరామరక్ష.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు