బిగ్ న్యూస్ బిగ్ డిబేట్: ఆంధ్రా బాక్సింగ్

మూడు రాజధానులపై మరోసారి మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ప్రక్రియ మొదలైందన్నారు. ప్రాసెస్‌లో చిన్నచిన్న సమస్యలు సహజమేనన్నారు. ప్రజలు కూడా వికేంద్రీకరణ కోసం ఎదురుచూస్తున్నారన్నారు. అటు సంక్షేమ పథకాలపైనా అధికార-విపక్షాల మధ్య వార్‌ జరుగుతోంది. ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకున్న రోజే రాజధాని తరలింపు ప్రక్రియ మొదలైపోయిందని ప్రకటించారు మంత్రి బొత్స. చట్టాలకు లోబడే నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. నిర్ణయం తర్వాత జరుగుతున్న కార్యక్రమాలన్నీ పరిపాలనలో భాగమేనన్నారు. కోర్టులను గౌరవిస్తూనే ముందుకు వెళ్తామన్నారు బొత్స. విజిలెన్స్ […]

బిగ్ న్యూస్ బిగ్ డిబేట్: ఆంధ్రా బాక్సింగ్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 07, 2020 | 10:57 PM

మూడు రాజధానులపై మరోసారి మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ప్రక్రియ మొదలైందన్నారు. ప్రాసెస్‌లో చిన్నచిన్న సమస్యలు సహజమేనన్నారు. ప్రజలు కూడా వికేంద్రీకరణ కోసం ఎదురుచూస్తున్నారన్నారు. అటు సంక్షేమ పథకాలపైనా అధికార-విపక్షాల మధ్య వార్‌ జరుగుతోంది.

ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకున్న రోజే రాజధాని తరలింపు ప్రక్రియ మొదలైపోయిందని ప్రకటించారు మంత్రి బొత్స. చట్టాలకు లోబడే నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. నిర్ణయం తర్వాత జరుగుతున్న కార్యక్రమాలన్నీ పరిపాలనలో భాగమేనన్నారు. కోర్టులను గౌరవిస్తూనే ముందుకు వెళ్తామన్నారు బొత్స. విజిలెన్స్ కార్యాలయం విజయవాడలోనే ఉండాలని చట్టంలో ఉందా అని ప్రశ్నించిన మంత్రి… బలవంతంగా సేకరించిన భూములు తిరిగి రైతులకు ఇవ్వనున్నట్టు చెప్పారు.

అటు క్యాపిటల్‌పై వార్‌ జరుగుతుండగానే.. ఇటు సంక్షేమ పథకాలపైనా టీడీపీ-వైసీపీ మధ్య మాటలయుద్ధం కంటిన్యూ అవుతోంది. ఏడున్నర లక్షలకు పైగా పెన్షన్లు.. 30లక్షల తెల్లరేషన్ కార్డులు తొలగించే కుట్ర జరుగుతుందని అర్హులైన లబ్ధిదారులను కూడా జాబితాల నుంచి తొలగిస్తున్నారని విమర్శించారు టీడీపీ నేతలు. సంక్షేమంలో కూడా కోతలా అని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే బోండా.

టీడీపీ ఆరోపణలకు కౌంటరిచ్చింది ఏపీ ప్రభుత్వం. మార్గదర్శకాలకు విరుద్దంగా ఉన్న కొంతమంది పేర్లు పక్కనపెట్టి పరిశీలిస్తున్నామని.. నిజమైన అర్హులుంటే పెన్షన్లు కొనసాగిస్తామన్నారు మంత్రి బొత్స. తెల్లరేషన్ కార్డులు తీసేస్తున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు.