కరోనా ఎఫెక్ట్: స్తంభించిన జనజీవనం.. ‘డెడ్ సిటీ’గా వుహాన్..!

కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 563మంది చనిపోగా.. బాధితుల సంఖ్య 30వేలకుపైగా చేరింది. గతేడాది చివర్లో వుహాన్ నగరంలో బయటపడిన ఈ వైరస్.. ఇప్పుడు చైనాతో పాటు 26దేశాలకు విస్తరించింది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఇదిలా ఉంటే ఈ వైరస్‌ బయల్పడిన వుహాన్ నగరం పరిస్థితి ఇప్పుడు అత్యంత దయానీయంగా మారిపోయింది. అక్కడి ప్రజలు జీవచ్ఛవంలా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వైరస్ తీవ్రత […]

కరోనా ఎఫెక్ట్: స్తంభించిన జనజీవనం.. 'డెడ్ సిటీ'గా వుహాన్..!

కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 563మంది చనిపోగా.. బాధితుల సంఖ్య 30వేలకుపైగా చేరింది. గతేడాది చివర్లో వుహాన్ నగరంలో బయటపడిన ఈ వైరస్.. ఇప్పుడు చైనాతో పాటు 26దేశాలకు విస్తరించింది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది.

ఇదిలా ఉంటే ఈ వైరస్‌ బయల్పడిన వుహాన్ నగరం పరిస్థితి ఇప్పుడు అత్యంత దయానీయంగా మారిపోయింది. అక్కడి ప్రజలు జీవచ్ఛవంలా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వైరస్ తీవ్రత ఎక్కువ అవుతుండటంతో ఇళ్లు, అపార్ట్‌మెంట్లను దాటి ప్రజలను రానివ్వడం లేదు. ఎంత అత్యవసర పరిస్థితి వచ్చినప్పటికీ.. అక్కడి ప్రజలను బయటకు అనుమతించడం లేదు. దీంతో రోడ్లన్నీ నిర్మానుషంగా మారిపోయాయి. మొత్తానికి వుహాన్ డెడ్‌ సిటీని తలపిస్తోంది.

కాగా అక్కడి పరిస్థితులపై హాంకాంగ్‌ ఆర్థిక, వాణిజ్య కార్యాలయ డైరెక్టర్‌ విన్సెంట్‌ ఫంగ్‌ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. ‘వుహాన్‌ వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోయి, ఆసుపత్రులన్నీ కరోనా బాధితులతో నిండిపోయాయి. నిత్యావసరాల విషయంలో  పెద్ద సమస్య ఏర్పడటం లేదు. సూపర్‌మార్కెట్లు, మందుల దుకాణాలు తెరిచే ఉన్నాయి. వస్తువుల సరఫరా కూడా బాగా జరుగుతోంది. అయితే ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. చాలా మంది ప్రజలు ఇళ్లల్లోనే చిక్కుకుపోయారు. ఈ మహమ్మారిని తరిమికొట్టే యుద్ధానికి ప్రజలు ఐక్యతతో వ్యవహరిస్తున్నారు’’ అని తెలిపారు.

Click on your DTH Provider to Add TV9 Telugu