AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharat-Bandh: వాహనదారులూ బీ అలర్ట్.. ‘భారత్ బంద్’ ఎఫెక్ట్.. హైదరాబాద్‌ ప్రజలకు ట్రాఫిక్ పోలీసుల సూచనలు..

వాహనదారులూ అలర్ట్ అవ్వండి. మంగళవారం నాడు ‘భారత్ బంద్’ నేపథ్యంలో హైదరాబాద్‌లో పలు రహదారులపై..

Bharat-Bandh: వాహనదారులూ బీ అలర్ట్.. ‘భారత్ బంద్’ ఎఫెక్ట్.. హైదరాబాద్‌ ప్రజలకు ట్రాఫిక్ పోలీసుల సూచనలు..
Shiva Prajapati
| Edited By: |

Updated on: Dec 07, 2020 | 7:34 PM

Share

వాహనదారులూ అలర్ట్ అవ్వండి. మంగళవారం నాడు ‘భారత్ బంద్’ నేపథ్యంలో హైదరాబాద్‌లో పలు రహదారులపై ప్రయాణాలు కష్టతరం అవుతాయని పోలీసులు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు డిసెంబర్ 8వ తేదీన ‘భారత్ బంద్’కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ బంద్‌కు రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో రాజధాని హైదరాబాద్ సహా, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నారు. దీంతో వాహనదారుల రోజువారీ ప్రయాణాలకు ఇబ్బంది తలెత్తే పరిస్థితి ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకున్న సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. వాహనదారులకు ముందస్తుగా సూచనలు జారీ చేశారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రయాణికులు సాధ్యమైనంత వరకు ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్లే ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఇక ఎమర్జెన్సీ సర్వీసులైన అంబులెన్స్‌లు, ఇతర సర్వీసులు యధావిధిగా నడుస్తాయన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎవరికైనా ఇబ్బంది తలెత్తితే పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 040-2785 3413, 040-2300 2424, 9490617100, 8500411111 కు ఫోన్ చేయవచ్చని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు.