2020 లో సౌత్ లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు ఇవే.. టాలీవుడ్ నుంచి ఆ మూడు సినిమాలు..

2020లో సినిమా ఇండస్ట్రీకి గడ్డు కాలమనే చెప్పాలి. ఈ ఏడాది కరోనా కల్లోలంతో సినిమా ఇండస్ట్రీ పడరాని పాట్లు పడింది. షూటింగ్స్ వాయిదా పడ్డాయి.

  • Rajeev Rayala
  • Publish Date - 4:25 pm, Tue, 22 December 20
2020 లో సౌత్ లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు ఇవే.. టాలీవుడ్ నుంచి ఆ మూడు సినిమాలు..

2020లో సినిమా ఇండస్ట్రీకి గడ్డు కాలమనే చెప్పాలి. ఈ ఏడాది కరోనా కల్లోలంతో సినిమా ఇండస్ట్రీ పడరాని పాట్లు పడింది. షూటింగ్స్ వాయిదా పడ్డాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు రిలీజ్ ఆగిపోయాయి. సినిమా తారలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. థియేటర్స్ లో విడుదల అవ్వాల్సిన సినిమాలు ఓటీటీ బాటపట్టాయి. ఇలా కరోనా విజ్రంభించక ముందు రిలీజ్ అయిన సినిమాలు. కరోనా సమయంలో ఓటీటీ ద్వారా విడుదలైన సినిమాలు అన్నింటిని కలుపుకొని ఈ  ఏడాది సౌత్ లో సూపర్ హిట్ అయిన సినిమాలు ఆరే. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురంలో’ యంగ్ హీరో నితిన్ నటించిన ‘భీష్మ’ సినిమాకూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే శర్వానంద్ నటించిన ‘జాను’ సినిమా కూడా ఈ ఏడాది విడుదలైనా  ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. కానీ శర్వా నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక  సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా  సినిమా ఓటీటీ వేదికగా విడుదలయ్యింది. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ  మూవీస్ తోపాటు మలయాళంలో ఫహద్ ఫాసిల్  ట్రాన్స్,  పృథ్వీరాజ్ నటించిన అయ్యప్పనమ్ కోషియం, దుల్కర్ సల్మాన్  కన్నుం కన్నుమ్ కొల్లయ్యడితాల్ మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి.