Breaking: మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు బెయిల్ మంజూరు..

టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు మచిలీపట్నం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న కొల్లు రవీంద్ర ప్రస్తుతం రాజమహేంద్రవరం జైలులో ఉన్నారు.

Breaking: మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు బెయిల్ మంజూరు..
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 24, 2020 | 4:37 PM

TDP Leader Kollu Ravindra: టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు మచిలీపట్నం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 28 రోజుల పాటు విజయవాడలో ఉండాలని ఆదేశించిన కోర్టు… సభలు, సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు సాక్షులను ప్రభావితం చేయకూడదని స్పష్టం చేసింది. సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని న్యాయస్థానం సూచించింది. వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న కొల్లు రవీంద్ర ప్రస్తుతం రాజమహేంద్రవరం జైలులో ఉన్నారు. తాజాగా కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రేపు ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు.

Also Read: బాలకృష్ణ గొప్ప మనసు.. కోవిడ్ ఆసుపత్రికి భారీ విరాళం..

కాగా జూన్ 29న హత్యకు గురైన వైసీపీ నేత మోకా భాస్కరరావు కేసులో పోలీసులు తొలుత ముగ్గురిని అరెస్ట్ చేశారు. అందులో కొల్లు రవీంద్ర అనుచరుడు కూడా ఉన్నాడు. వారు ఇచ్చిన సమాచారంతో ఈ కేసులో కొల్లు రవీంద్ర భాగస్వామ్యం అయినట్లు తేలింది. దీంతో రవీంద్రపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన్ని అరెస్ట్‌ చేసి.. ఆ తర్వాత రాజమహేంద్రవరం జైలుకు తరలించారు.

Also Read: ఢిల్లీ టూ లండన్.. బస్సులో అడ్వెంచర్ జర్నీ..