Boost Immunity against Covid: కరోనా రోగులు నీచు ముట్టొద్దా..? తింటే బ్లాక్‌ ఫంగస్‌ అంటుతుందా..? ప్రొటీన్ ఫుడ్‌పై కన్ఫూజన్..!

కరోనా రోగులు నీచు ముట్టొద్దా..? తింటే బ్లాక్‌ ఫంగస్‌ ఎటాక్‌ అవుతుందా..? ప్రొటీన్ ఫుడ్‌ చాలా అవసరం అంటున్నారు అలోపతి వైద్యులు. ఆకలి లేకుంటే ఏమీ తినొద్దంటున్నారు ఆయుర్వేదం వైద్యులు.

Boost Immunity against Covid: కరోనా రోగులు నీచు ముట్టొద్దా..? తింటే బ్లాక్‌ ఫంగస్‌ అంటుతుందా..? ప్రొటీన్ ఫుడ్‌పై కన్ఫూజన్..!
Ayurveda And Allopathic Therapeutic Strategies
Follow us
Balaraju Goud

|

Updated on: May 19, 2021 | 4:57 PM

Ayurveda and Allopathic Therapeutic Strategies: కరోనా రోగులు నీచు ముట్టొద్దా..? తింటే బ్లాక్‌ ఫంగస్‌ ఎటాక్‌ అవుతుందా..? ప్రొటీన్ ఫుడ్‌ చాలా అవసరం అంటున్నారు అలోపతి వైద్యులు. ఆకలి లేకుంటే ఏమీ తినొద్దంటున్నారు ఆయుర్వేదం వైద్యులు. ఇంతకీ రోగులు దేన్ని ఫాలో అవ్వాలి. ఏంటీ కన్ఫూజన్… కరోనా రోగుల డైట్‌పై గందరగోళం ఏర్పడింది.

కరోనా చికిత్స విధానంపైనే కాదు.. కరోనా రోగులు తినే ఫుడ్‌పై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాయదారి వైరస్‌ బారిన పడిన కరోనా రోగులు.. కచ్చితంగా మంచి మంచి ఆహారం తీసుకోవాలని అలోపతి వైద్యులు సూచిస్తున్నారు. పోషక విలువలతో కూడిన ఫుడ్ తీసుకుంటే త్వరగా కోలుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటి వరకు అదే పాటిస్తూ వస్తున్నారు రోగులు. రోజూ గుడ్‌ తీసుకుంటే మంచిదంటున్నారు. డ్రైఫ్రూట్స్‌ కూడా తినాలంటున్నారు. ప్లేట్‌లో చికెన్ మస్ట్‌ అంటున్నారు.

ఇదిలావుంటే, ఇలాంటి ఫుడ్‌ వల్లే దుష్ప్రభావం ఉందంటున్నారు ఆయుర్వేద వైద్యులు. సెకండ్‌ వేవ్‌లో సైడ్‌ ఎఫెక్ట్స్‌కు ఇదే కారణంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఆకలి లేకపోయినా జీర్ణవ్యవస్థపై భారం పెంచి.. ఆహారాన్ని విషంగా మారుస్తున్నామంటూ సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు ఆయుర్వేద వైద్యులు. ప్రస్తుతం కరోనాకు అందిస్తున్న చికిత్స విధానంలో పెద్ద లోపం ఉందని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు. ఇష్టం వచ్చినట్టు స్టెరాయిడ్స్ ఇస్తున్నారని.. ఫుడ్‌ విషయంలోనూ తప్పుడు ప్రచారం జరుగుతోందంటున్నారు. బాడీ సహకరించకపోయినా బలవంతంగా ఫుడ్‌ తింటున్నారని.. హెవీ ఫుడ్ తీసుకోవడం కూడా సైడ్‌ ఎఫెక్ట్స్‌కు కారణమవుతున్నాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.

జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నప్పుడు తీసుకునే ఆహారం విషంగా మారుతోందని ఆయుర్వేద వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల బాడీకి శక్తి రాకపోగా.. ఉన్న వ్యవస్థలు దెబ్బ తినే ఛాన్స్ ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోతాకు మించి ఇస్తున్న స్టెరాయిడ్స్‌ కూడా రోగులపై దుష్ప్రభావం చూపుతోందని.. బ్లాక్ ఫంగస్ లాంటి వ్యాధులకు కారణమవుతోందంటున్నారు ఆయుర్వేద వైద్యులు. కరోనా ఎఫెక్ట్‌ అయిన రోగులు మొదటి ఐదారు రోజుల వరకు లైట్‌ డైట్‌ తీసుకోవాలని.. ఆకలిగా లేకుంటే.. ఒక పూట తినకపోయినా ఫర్వాలేదంటున్నారు. లేకుంటే గంజి లాంటి ద్రవపదార్థాలు తాగితే సరిపోతుందని… బాడీ రీబూట్‌ అవుతుందన్నారు వైద్యులు.

ఇదిలావుంటే, అలోపతి వైద్యులు చెబుతున్న డైట్‌కు ఆయుర్వైద వైద్యులు చెబుతున్న డైట్‌కు చాలా తేడాలు ఉంటున్నాయి. హెవీ ప్రొటీన్స్‌ ఉన్న ఫుడ్ తీసుకోవాలని అలోపతి వైద్యులు చెబుతుంటే… అలాంటి ఫుడ్డే వద్దంటున్నారు ఆయుష్‌ వైద్యులు. ఈ ప్రకటన ఇప్పుడు జనాల్లో కన్ఫూజన్ క్రియేట్ చేసింది. ఏం తింటే ఎలాంటి చేటు వస్తుందో అన్న డైలమాలో ప్రజలు పడిపోయారు. అసలే కరోనా పేరుతో రోజుకో వైద్యం ప్రజలను రోగాల బారిన పడేట్టు చేస్తోంది. ఇప్పుడు ఫుడ్‌ విషయంలోనూ వైద్యుల మధ్య వినిపిస్తున్న భిన్న వాదనలు మరింత గందరగోళపరుస్తున్నాయి.

Read Also… AP Gender Budget: ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. జెండర్‌ బేస్డ్‌ బడ్జెట్‌.. పిల్లలు, మహిళలకు ప్రత్యేక కేటాయింపులు