ఏపీ పీజీ ఈసెట్‌ 2020 విడుదల..

ఏపీ పీజీ ఈసెట్‌ 2020 ఫలితాలు వచ్చేశాయి. శుక్రవారం ఏయూ ఉప కులపతి ఆచార్య పీవీ జీడీ ప్రసాద్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఏపీ పీజీ ఈ సెట్ 2020 నిర్వహించే అవకాశం ఇవ్వడం ఆనందంగా ఉందని వీసీ ఆచార్య పీవీ జీడీ ప్రసాద్ రెడ్డి అన్నారు.

  • Sanjay Kasula
  • Publish Date - 2:39 pm, Fri, 23 October 20
ఏపీ పీజీ ఈసెట్‌ 2020 విడుదల..

AP PG ECET ‌: ఏపీ పీజీ ఈసెట్‌ 2020 ఫలితాలు వచ్చేశాయి. శుక్రవారం ఏయూ ఉప కులపతి ఆచార్య పీవీ జీడీ ప్రసాద్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఏపీ పీజీ ఈ సెట్ 2020 నిర్వహించే అవకాశం ఇవ్వడం ఆనందంగా ఉందని వీసీ ఆచార్య పీవీ జీడీ ప్రసాద్ రెడ్డి అన్నారు. ఎంటెక్, ఎంఫార్మసీ ప్రవేశాలకు 28,868మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారని వెల్లడించారు. 22,911 మంది హాజరయ్యారు. 20,157 మంది అర్హులయ్యారని తెలిపారు. 42 సెంటర్లలో ఈ టెస్ట్ నిర్వహించామని … మొత్తం 87.98 శాతం మంది అర్హులయ్యారని చెప్పారు. ఎంటెక్‌కు 17,150 మంది హాజరు కాగా, 14,775 మంది అర్హత సాధించారని ప్రకటించారు.

ఫార్మసీ పరీక్షలకు 5,761 మంది హాజరు కాగా 5,382 మంది అర్హత సాధించారు. ఎంఫార్మసీ అడ్మిషన్స్ కూడా ఆన్ లైన్‌లో నిర్వహిస్తాని అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ ఈ అడ్మిషన్ ప్రక్రియ నిర్వహిస్తోందని తెలిపారు. కోవిడ్ వల్ల ఈ పరీక్షలకు హాజరు కాలేని వారికి మరో సారి పరీక్ష నిర్వహించనున్నట్లుగా వెల్లడించారు. కరోనా కారణంగా దూరంగా ఉన్న విద్యార్థుల కోసం రెండవ సారి ఎంట్రన్స్ నిర్వహించమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని పేర్కొన్నారు.