తీరని విషాదం :పెళ్లిరోజే ప్రమాదంలో భర్తను కోల్పోయింది..కుమార్తె చావుబతుకుల్లో

విధి ఎవరి జీవితాలతో ఎప్పుడు, ఎలా ఆడుకుంటుందో తెలీదు. తాజాగా పెళ్లిరోజు వేడుకలను బంధువుల ఇంట ఆనందంగా జరుపుకుందామని వెళ్తోన్న దంపతులపై చిన్నచూపు చూసింది.

తీరని విషాదం :పెళ్లిరోజే ప్రమాదంలో భర్తను కోల్పోయింది..కుమార్తె చావుబతుకుల్లో
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 20, 2020 | 2:16 PM

విధి ఎవరి జీవితాలతో ఎప్పుడు, ఎలా ఆడుకుంటుందో తెలీదు. తాజాగా పెళ్లిరోజు వేడుకలను బంధువుల ఇంట ఆనందంగా జరుపుకుందామని వెళ్తోన్న దంపతులపై చిన్నచూపు చూసింది.  కుటుంబ సభ్యులతో కలసి మోటార్ సైకిల్‌పై వెళుతున్న వారిని లారీ మృత్యువు రూపంలో వెంటాడి భర్తను బలితీసుకుంది. కుమార్తెకు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో ప్రమాదకరస్థితిలో ఉంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బెజవాడకు చెందిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ కేశాని అమరేశ్వరరావు (32) ఘంటసాల మండలం చిట్టూర్పు వద్ద జరిగిన యాక్సిడెంట్‌లో గురువారం మృతి చెందాడు. ఈ ప్రమాదంలో భార్య లావణ్యకు, కుమార్తె భవిష్యకు గాయాలు కాగా ఏడాదిన్నర వయసున్న కుమారుడు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. మొవ్వ మండలం గూడపాడుకు చెందిన అమరేశ్వరరావు…. మోపిదేవి మండలం కొక్కిలిగడ్డ కొత్తపాలెంలోని అత్తగారి ఇంటి  నుంచి బయలుదేరి  సొంతూరు మొవ్వ మండలం గూడపాడు ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు.  ఈ క్రమంలో చల్లపల్లి వైపు వస్తున్న లారీ ఢీ కొంది. ఈ ఘటనలో అమరేశ్వరరావు తలకు బలమైన గాయమై స్పాట్‌లోనే మృతిచెందాడు. స్థానికుల సమాచారంలో అక్కడికి చేరుకున్న అంబులెన్స్‌లో‌‌ గాయాలపాలైన భార్య లావణ్య, కుమార్తె భవిష్యను హాస్పిటల్‌కు తరలించారు. కాగా  కుమార్తె  పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.  కాగా ఐదేళ్లు క్రితం ఇదే రోజున అమరేశ్వరరావు, లావణ్యలకు వివాహమైంది. అదే రోజున ఈ విషాదం వెంటాడింది.

Also Read :

వారెవ్వా.. అతడికి అదృష్టం ఆకాశం నుంచి ఊడిపడింది..ఒక్క రోజులో కోటీశ్వరుడు

పెంపుడు శునకంపై మితిమీరిన ప్రేమ..యువతి ఆత్మహత్య..అక్కడే పూడ్చిపెట్టాలంటూ..