Bigg Boss 4: గ్రాండ్ ఫినాలే అప్పుడే.. ప్రణాళికలు సిద్ధం చేస్తోన్న నిర్వాహకులు
కరోనా నేపథ్యంలో ఈసారి బిగ్‌బాస్ ఉంటుందా..? ఉండదా..? అని చాలా అనుమానాలే నడిచాయి. కానీ వాటన్నింటికి చెక్ పెడుతూ నాలుగో సీజన్‌ని స్టార్ట్ చేశారు.
Bigg Boss 4 Grand Finale: కరోనా నేపథ్యంలో ఈసారి బిగ్‌బాస్ ఉంటుందా..? ఉండదా..? అని చాలా అనుమానాలే నడిచాయి. కానీ వాటన్నింటికి చెక్ పెడుతూ నాలుగో సీజన్‌ని స్టార్ట్ చేశారు. నాగార్జున వ్యాఖ్యతగా సెప్టెంబర్ 6న బిగ్‌బాస్ నాలుగో సీజన్ ప్రారంభం అయ్యింది. ఈసారి పెద్ద పెద్ద కంటెస్టెంట్‌లను తీసుకురానప్పటికీ.. కాస్త పేరు తెలిసిన వారినే తీసుకొచ్చి హౌజ్‌లో డ్రామాను నడిపిస్తున్నారు. ఈ క్రమంలో అప్పుడప్పుడు కాస్త సో సోగా ఎపిసోడ్‌లు ఉన్నప్పటికీ.. వీక్షకుల్లో మాత్రం ఈసారి బిగ్‌బాస్ విన్నర్ ఎవరు అవుతారా..? అన్న ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఈ మూవీ గ్రాండ్ ఫినాలేకి సంబంధించిన ఓ వార్త ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. (సెప్టెంబర్‌లోనే పెళ్లి చేసుకున్న ప్రభుదేవా.. పెళ్లికూతురు బంధువుల అమ్మాయి కాదట.. మరెవరంటే!)
డిసెంబర్ 20న బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ఉండబోతుందని.. అందుకోసం నిర్వాహకులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రతిసారిలానే ఈ సారి గ్రాండ్‌గా ఏర్పాట్లు జరగబోతున్నట్లు టాక్. కాగా ఈ సీజన్‌లో మోనాల్, సూర్య కిరణ్, లాస్య, అభిజిత్, జోర్దార్ సుజాత్, మెహబూబ్ దిల్‌సే, దేవి నాగవల్లి, సయ్యద్ సొహైల్, అరియనా, అమ్మ రాజశేఖర్, కరాటే కల్యాణి, నోయల్, దివి, అఖిల్, గంగవ్వ కంటెస్టెంట్‌లుగా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత కుమార్ సాయి, అవినాష్, స్వాతి దీక్షిత్ వైల్డ్‌కార్డు ఎంట్రీ ఇచ్చారు. వీరిలో గంగవ్వ, నోయల్ ఆరోగ్యం బాగోలేక మధ్యలో వచ్చేయగా.. మిగిలిన వారిలో ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ.. ప్రస్తుతం హౌజ్‌లో అభిజిత్, అఖిల్, మోనాల్, హారిక, సొహైల్, అరియానా, అవినాష్, హారిక, లాస్యలు మిగిలారు. (ఆయన జీవితం మొత్తం వెన్నుపోటు, శవరాజకీయాలే.. చంద్రబాబు ఎమ్మెల్యే రోజా ఫైర్)