బిగ్ బాస్ 4: ఈ ముగ్గురులో ఒకరు హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్నారు.. వారెవరంటే.!
బిగ్ బాస్ సీజన్ 4 అప్పుడే 11వ వారం చివరికి వచ్చేసింది. నామినేషన్ల ప్రక్రియ వస్తే చాలు కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణల దిగడం..
Bigg Boss 4: బిగ్ బాస్ సీజన్ 4 అప్పుడే 11వ వారం చివరికి వచ్చేసింది. నామినేషన్ల ప్రక్రియ వస్తే చాలు కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణల దిగడం.. ఆ తర్వాత కాసేపటికి మళ్లీ మాములు అయిపోవడం అలవాటుగా మారిపోయింది. ఈ సీజన్‌లో అయితే రచ్చ తారస్థాయిలో ఉందని చెప్పాలి.
ఇదిలా ఉంటే వైల్డ్ కార్డు ఎంట్రీలతో కలిపి మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ 4 టైటిల్ కోసం పోటీ పడగా.. 11 వారం చివరికి హౌస్‌లో 8 మంది మాత్రమే మిగిలారు. వీరిలో ఈవారం ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. కాగా, 11 వారం ఎలిమినేషన్‌కు అభిజిత్, హారిక, అరియానా, లాస్య, సొహైల్, మోనాల్‌లు నామినేట్ అయిన సంగతి తెలిసిందే.
వీరందరిలో అభిజిత్, సోహైల్, అరియానా సేఫ్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రేక్షకుల ఓటింగ్ పరంగా అభిజిత్ మళ్లీ టాప్ ప్లేస్ దక్కించుకున్నాడట. ఇక పెర్ఫార్మన్స్ పరంగా లాస్య, హారిక, మోనాల్‌ల కంటే అరియానా బెటర్‌గా ట్రై చేస్తుండటం వల్ల ఆమె కూడా సేఫ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. అటు అఖిల్ ఈ వారం ఎలిమినేషన్‌లో లేడు కాబట్టి.. అతడి ఫ్యాన్స్ అంతా కూడా మోనాల్‌కు ఓటు వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ విధంగా చూసుకుంటే హారిక, లాస్యలలో ఒకరు ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారని టాక్. మరి అది తెలియాలంటే వేచి చూడాల్సిందే.
Also Read:
జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఈ నెల 25న వారి ఖాతాల్లోకి రూ. 10 వేలు జమ.!
ఏపీ ప్రజలకు ఆర్టీసీ గుడ్ న్యూస్.. పంచారామాలకు 1,750 స్పెషల్ బస్సులు..