Bigg Boss 4: ఫ్రెండ్‌ని చూసి భోరున ఏడ్చేసిన అరియానా.. నాకు అన్నం పెట్టింది ఇతనే.. లవ్‌ యూ వినీత్‌

బిగ్‌బాస్‌లోకి అరియానా తరఫున ఆమె స్నేహితుడు వినీత్ వచ్చాడు. అతడి ఎంట్రీతో అరియానా భావోద్వేగానికి గురైంది. వినీత్‌ది, నాది 12 సంవత్సరాల ఫ్రెండ్‌షిప్‌

Bigg Boss 4: ఫ్రెండ్‌ని చూసి భోరున ఏడ్చేసిన అరియానా.. నాకు అన్నం పెట్టింది ఇతనే.. లవ్‌ యూ వినీత్‌
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 20, 2020 | 7:54 AM

Ariyana Friend Vineet: బిగ్‌బాస్‌లోకి అరియానా తరఫున ఆమె స్నేహితుడు వినీత్ వచ్చాడు. అతడి ఎంట్రీతో అరియానా భావోద్వేగానికి గురైంది. వినీత్‌ది, నాది 12 సంవత్సరాల ఫ్రెండ్‌షిప్‌. తొమ్మిదో తరగతి నుంచి మేమిద్దరం ఫ్రెండ్స్‌. నా ప్రతి అప్‌ అండ్‌ డౌన్‌లో ఉన్నాడు. చాలా వరకు డబ్బుల కోసం కష్టపడ్డా. కొన్ని సందర్భాల్లో మా అమ్మ లేదు, చెల్లి లేదు. కానీ వినీత్‌ ఉన్నాడు. అన్నం లేని సమయంలో దొంగతనంగా వెళ్లి.. వీళ్ల ఇంట్లో అన్నం తినేదాన్ని. ఐ లవ్‌ యు వినీత్‌. నువ్వు నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌వి అంటూ వినీత్‌ గురించి అందరికీ చెప్పింది. ఇక అతడు మిగిలిన కంటెస్టెంట్‌లతో మాట్లాడుతుండగా.. కాస్త పొసెసివ్‌గా ఫీలై, నువ్వు నాతో మాట్లాడు అంటూ వెల్లడించింది. మీ చెల్లిలితో గొడవ పడి నిన్ను కలవడానికి ఇక్కడకు వచ్చా. నువ్వు నీలాగే గేమ్ ఆడు. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నావు. ఇంకా ధైర్యంగా ఉండు అని వినీత్‌ చెప్పాడు. మొత్తానికి వినీత్‌ రాకతో అరియానా కాస్త అతి చేసినట్లుగా అనిపించింది.

Read More:

Bigg Boss 4: ఏదైనా ఉంటే డైరెక్ట్‌గా మాట్లాడు.. అభిజిత్‌కి మోనాల్ సోదరి క్లాస్‌.. హర్ట్‌ అయిన అభి, హారిక

టీడీపీలో విషాదం.. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభ కన్నుమూత.. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ..!