టీడీపీలో విషాదం.. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభ కన్నుమూత.. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ..!

చిత్తూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే సత్యప్రభ కన్నుమూశారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి గుండెపోటుకు

  • Tv9 Telugu
  • Publish Date - 6:58 am, Fri, 20 November 20
టీడీపీలో విషాదం.. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభ కన్నుమూత.. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ..!

DK Satya Prabha: చిత్తూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే సత్యప్రభ కన్నుమూశారు. అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి గుండెపోటుకు గురై ఆమె తుదిశ్వాస విడిచారు. అయితే ఇటీవలే ఆమె కరోనా నుంచి కోలుకున్నారు. కాగా టీటీడీ మాజీ ఛైర్మన్ డీకే ఆదికేశవులు నాయుడు సతీమణి అయిన సత్యప్రభ.. ఆయన మృతితో రాజకీయాల్లోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో చిత్తూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత 2019 ఎన్నికల్లో రాజంపేట అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవలే సత్యప్రభ టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా రెండోసారి ఎన్నికయ్యారు. ఇక సత్యప్రభ మరణంతో టీడీపీలో విషాదం నెలకొంది. ఆమె లేకపోవడం టీడీపీకి లోటు అని ఆ పార్టీ నేతలు విచారం వ్యక్తం చేశారు. కాగా సత్యప్రభ అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి.