రెమిడెసివిర్‌తో ఉపయోగం లేదు: డబ్ల్యూహెచ్‌వో ఊహించని ప్రకటన

రెమిడెసివిర్.. కరోనా చికిత్సలో ప్రభావంతమైన  ఫలితాలు ఇస్తుందని భావిస్తున్న యాంటీవైరల్‌ డ్రగ్. ‌ అయితే దీన్ని కోవిడ్‌తో ఆస్పత్రిలో చేరిన వారికి ఇవ్వొద్దని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.

రెమిడెసివిర్‌తో ఉపయోగం లేదు: డబ్ల్యూహెచ్‌వో ఊహించని ప్రకటన
Remdesivir
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 20, 2020 | 1:58 PM

రెమిడెసివిర్.. కరోనా చికిత్సలో ప్రభావంతమైన  ఫలితాలు ఇస్తుందని భావిస్తున్న యాంటీవైరల్‌ డ్రగ్. ‌ అయితే దీన్ని కోవిడ్‌తో ఆస్పత్రిలో చేరిన వారికి ఇవ్వొద్దని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. వైరస్ సోకిన వ్యక్తి ఎంతటి అనారోగ్యానికి గురైనప్పటికీ.. ఈ డ్రగ్ ఇవ్వవద్దని చెప్పింది. ఇప్పటి వరకు అందిన నివేదికల ప్రకారం కరోనాపై పోరాటంతో ఇది ప్రభావం చూపుతున్నట్లు ఎలాంటి ఆధారాలూ లభించలేదని వెల్లడించింది. వెంటిలేటర్‌ దశకు చేరకుండా ఉండటానికి..రోగులుకు రెమిడెసివిర్‌ పెద్దగా ఆశాజనక ఫలితాలేమీ ఇవ్వడం లేదని తెలిపింది.

కరోనా వైరస్‌తో ఆస్పత్రిలో చేరిన ఏడు వేల మందిపై జరిపిన పరిశోధనల వివరాల్ని పరిశీలించిన తర్వాత  డబ్ల్యూహెచ్‌వో ఈ ప్రకటన చేసింది. అయితే, రెమిడెసివిర్‌ వల్ల ఎలాంటి ఉపయోగాలు లేవని చెప్పడం మాత్రం తమ ఉద్దేశం కాదని వెల్లడించింది. కరోనా సోకినవారికి ఇస్తున్న సాధారణ చికిత్సతో పోలిస్తే ఈ డ్రగ్ అందించడానికి అవుతున్న ఖర్చు, ఇస్తున్న విధానం అంత ప్రయోజనకరంగా ఏమీ లేదన్నదే తమ అభిప్రాయం అని చెప్పింది.

కరోనా బారిన పడిన వారు త్వరగా కోలుకోవడంలో రెమిడెసివిర్‌ బాగా పనిచేస్తోందని పలువురు నిపుణులు అభిప్రాయపడిన విషయం తెలిససిందే. దీంతో అమెరికా సహా ఐరోపా దేశాల్లో ఎమర్జెన్సీ పరిస్థితుల్లో డాక్లర్ల సలహా మేరకు దీన్ని వినియోగించడానికి అనుమతి లభించింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్‌ ట్రంప్‌ సైతం దీన్ని వినియోగించారు. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో ఈ ప్రకటన చేయడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది.

Also Read :

వారెవ్వా.. అతడికి అదృష్టం ఆకాశం నుంచి ఊడిపడింది..ఒక్క రోజులో కోటీశ్వరుడు

పెంపుడు శునకంపై మితిమీరిన ప్రేమ..యువతి ఆత్మహత్య..అక్కడే పూడ్చిపెట్టాలంటూ..

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు