AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక నుంచి పెళ్లికి ముందే కల్యాణలక్ష్మి.. లగ్నపత్రిక రాయించుకున్న వెంటనే అప్లై చేసుకోవచ్చు..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన కల్యాణ లక్ష్మి పథకం పేద యువతులకు ఎంతగానో దోహద పడుతోంది.. నిరుపేద కుటుంబాలకు ఆసరాగా నిలుస్తోంది..

ఇక నుంచి పెళ్లికి ముందే కల్యాణలక్ష్మి.. లగ్నపత్రిక రాయించుకున్న వెంటనే అప్లై చేసుకోవచ్చు..
Balaraju Goud
|

Updated on: Nov 20, 2020 | 1:56 PM

Share

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన కల్యాణ లక్ష్మి పథకంపేద యువతులకు ఎంతగానో దోహద పడుతోంది.. నిరుపేద కుటుంబాలకు ఆసరాగా నిలుస్తోంది.. అక్కడక్కడ కొన్ని అవకతవకలు జరిగినా అంతిమంగా ఈ పథకం ఆడపడుచులకు అండగా నిలుస్తోంది.. 2014 అక్టోబర్ 2న ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా మొదట్లో రూ. 51, 000 అందించేవారు. తర్వాత రూ.75,116లకు పెంచారు. అనంతరం 2018లో రూ.1,00116లకు పెంచారు.

కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే పెళ్లి తర్వాత చాలా డాక్యుమెంట్లు సమర్పించి దరఖాస్తు చేసుకోవలసి ఉండేది. అంతేకాకుండా వచ్చే నగదు కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. లబ్ధిదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందిపడేవారు.. వీరి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న మధ్యవర్తులు డబ్బులు ఇప్పిస్తానని చెప్పి వారిని మోసం చేసేవారు. వీటన్నిటికీ పుల్‌స్టాప్ పెట్టడానికి ప్రభుత్వం పథకానికి సంబంధించిన కొన్ని నిబంధనలను సవరించింది. ప్రభుత్వ అధికారుల ద్వారా వాటిని అమలు చేస్తోంది.. తాజాగా పెళ్లికి ముందే కల్యాణలక్ష్మి సాయం పొందవచ్చని తొర్రూరు తహసీల్దార్ రాఘవరెడ్డి తెలిపారు. లగ్నపత్రిక రాయించుకున్న రోజునే వధువు కుటుంబ సభ్యులు కల్యాణలక్ష్మి పథకానికి అప్లై చేసుకోవచ్చన్నారు. కులం, ఆదాయ, నివాస, ఇతర ధ్రువీకరణ పత్రాలుమీ సేవలో సమర్పించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇలా చేయడం వల్ల సరిగ్గా పెళ్లి ముహూర్తానికల్లా రూ.1,00116 ఆర్థికసాయం పొందవచ్చని తెలిపారు. దళారులు, మధ్యవర్తులను నమ్మవద్దని అన్నారు. డబ్బులు నేరుగా వధువు తల్లి ఖాతాలో జమవుతాయని వివరించారు. అర్హులైన నిరుపేద యువతులందరూ ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలని కోరారు.