ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. టికెట్ల రద్దుకు మరో అవకాశం..
APSRTC Refund Tickets: ప్రయాణీకులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది. లాక్డౌన్ సమయంలో టికెట్లు బుక్ చేసుకుని గడువులోగా టికెట్లు క్యాన్సిల్ చేసుకోలేనివారికి మరో అవకాశం కల్పించింది. వారందరికీ డబ్బులు వాపస్ ఇచ్చేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా టికెట్ క్యాన్సిలేషన్ పాలసీలో పలు సవరణలు కూడా చేసింది. మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 మధ్య రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణీకులు ఈ నెల 29లోగా టికెట్లను రద్దు చేసుకోవాలని సూచించింది. వారంతా కూడా స్థానిక బస్టాండులు, […]
APSRTC Refund Tickets: ప్రయాణీకులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది. లాక్డౌన్ సమయంలో టికెట్లు బుక్ చేసుకుని గడువులోగా టికెట్లు క్యాన్సిల్ చేసుకోలేనివారికి మరో అవకాశం కల్పించింది. వారందరికీ డబ్బులు వాపస్ ఇచ్చేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా టికెట్ క్యాన్సిలేషన్ పాలసీలో పలు సవరణలు కూడా చేసింది. మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 మధ్య రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణీకులు ఈ నెల 29లోగా టికెట్లను రద్దు చేసుకోవాలని సూచించింది. వారంతా కూడా స్థానిక బస్టాండులు, ఏటీబీ కౌంటర్లలో టికెట్లు చూపించి రద్దు చేసుకోవచ్చని ఏపీఎస్ఆర్టీసీ పేర్కొంది. ప్రయాణీకులు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపింది.
Also Read:
కరోనా మృతుల అంత్యక్రియలకు రూ. 15 వేలు.. జగన్ సర్కార్ సంచలనం..