AP Lockdown: ఏపీలోని ఆ రెండు ప్రాంతాల్లో మళ్లీ కఠిన లాక్‌డౌన్…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది.ఈ నేపధ్యంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో అధికారులు మరోసారి కఠిన లాక్‌డౌన్ విధించగా.. తాజాగా

AP Lockdown: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా గుంటూరు, కర్నూలు, అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఈ నేపధ్యంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో అధికారులు మరోసారి కఠిన లాక్‌డౌన్ విధించగా.. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలలో ఇవాళ్టి నుంచి మళ్లీ లాక్ డౌన్ అమలు చేయనున్నారు.
తూర్పుగోదావరిలో పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. రాజమండ్రి, కాకినాడతో పాటుగా జిల్లాలోని ఇతర పట్టణాలు, మండలాల్లో కూడా కరోనా కేసులు విస్తరిస్తున్నాయి. దీనితో అప్రమత్తమైన అధికారులు ఇవాళ్టి నుంచి కాకినాడలో తిరిగి లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయనున్నారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు షాపులు తెరిచేందుకు అనుమతించగా.. ఆ తర్వాత కేవలం నిత్యావసర వస్తువుల దుకాణాలు, మెడికల్ షాపులు మాత్రమే ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఉదయం 11 గంటల తర్వాత రోడ్లపైకి జనాలు వచ్చేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
అటు కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా భీమవరంలో నేటి నుంచి లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తెలిపారు. ఇవాళ్టి నుంచి పట్టణంలో ఆటోలు తిరిగేందుకు అనుమతి లేదన్న ఆయన.. షాపులు ఉదయం 6 గంటల నుంచి 11 వరకు మాత్రమే తెరిచి ఉంటాయన్నారు. అలాగే పట్టణం నలువైపులా చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామన్నారు. ఇక కూరగాయలు, చేపల మార్కెట్‌లను మూసి వేస్తున్నామన్నారు. కాగా, స్థానిక ఆధార్ కార్డు ఉన్నవారికి మాత్రమే మద్యం విక్రయించాలని అన్నారు.
Also Read:
ఏపీ ప్రజలకు బ్యాడ్ న్యూస్.. ఆ రూట్లలో బస్సు సర్వీసులు నిలిచిపోయినట్లే.!
విద్యార్ధులకు ఆ రోజే ‘జగనన్న విద్యా కానుక’.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఏపీ: ఆగష్టు 3 నుంచి ఇంటర్ కళాశాలల రీ-ఓపెన్.. 196 పనిదినాలు..!