AP New Districts: జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధం.!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల కాస్తా త్వరలోనే 25 జిల్లాలుగా మారనున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల కాస్తా త్వరలోనే 25 జిల్లాలుగా మారనున్నాయి. ఈ నెల 15వ తేదీ జరగనున్న కేబినేట్ భేటిలో జిల్లాల విభజనపై జగన్ సర్కార్ అధికారికంగా నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. కాగా, ఇటీవల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రస్తావన వచ్చిన సంగతి తెలిసిందే. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసే ఆలోచన ఉందని అధికారులకు సీఎం వివరించిన విషయం విదితమే.
కాగా, గత నెల 11న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ‘జగనన్న తోడు’, ‘వైఎస్సార్ చేయూత’, ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’, ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్’ స్కీములకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వీటితోపాటు గృహనిర్మాణాల మార్గదర్శకాల్లో మార్పులు.. చేర్పులకు, ఇళ్లపట్టాలు, శ్రీకాకుళం, మచిలీపట్నం, గుంటూరు గవర్నమెంట్ నర్సింగ్ కళాశాలల్లో 282 టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
Also Read:
ఏపీ ప్రజలకు బ్యాడ్ న్యూస్.. ఆ రూట్లలో బస్సు సర్వీసులు నిలిచిపోయినట్లే.!
విద్యార్ధులకు ఆ రోజే ‘జగనన్న విద్యా కానుక’.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఏపీ: ఆగష్టు 3 నుంచి ఇంటర్ కళాశాలల రీ-ఓపెన్.. 196 పనిదినాలు..!