బ్రేకింగ్: ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు కరోనా..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. ఆయనతో పాటు భార్య, కుమార్తెకు కూడా కరోనా వైరస్ సోకింది. కడప జిల్లాలో నిర్వహించిన పరీక్షల్లో వీరికి కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో..

ఏపీలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోన్న విషయం తెలిసిందే. రోజు రోజుకీ కోవిడ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ వైరస్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ విధిస్తుంది ఏపీ ప్రభుత్వం. మరికొన్ని ప్రాంతాల్లో అయితే ప్రజలు, వ్యాపారులే స్వచ్ఛందంగా లాక్ డౌన్ అమలు పరుస్తున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, పలువురు ప్రముఖులు, వైద్యులు, పోలీసు సిబ్బందికి కూడా కరోనా సోకడం.. ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తుంది.
తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. ఆయనతో పాటు భార్య, కుమార్తెకు కూడా కరోనా వైరస్ సోకింది. కడప జిల్లాలో నిర్వహించిన పరీక్షల్లో వీరికి కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో శుక్రవారం రాత్రి 1 గంటకు వారు తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆ ముగ్గురికీ ప్రత్యేక గదిని కేటాయించి చికిత్స చేస్తున్నారు వైద్యులు. కాగా ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని స్విమ్స్ వైద్యులు వెల్లడించారు.
ఇక ఏపీలో గడిచిన 24 గంటల్లో 1933 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందినవి 19,14 కాగా, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో 19 మందికి వైరస్ సోకింది. దీనితో రాష్ట్రంలో మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 29,168కి చేరింది. వీరిలో 13,428 మంది చికిత్స పొందుతుండగా.. 15,412 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక నిన్నఒక్క రోజే 19 మంది కరోనాతో చనిపోగా.. ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 328కి చేరింది.
Read More: అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం.. తీవ్ర ఆందోళన ప్రజలు