ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ నెల 13 నుంచి వీడియో పాఠాలు..

కడప: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు ఎటువంటి ఆటంకం కలగకుండా దూరదర్శన్ ద్వారా పాఠాలు ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జిల్లా వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నెల 13వ తేదీ నుంచి దూరదర్శన్ ఛానల్ ద్వారా వీడియో పాఠాలను సబ్జెక్ట్ నిపుణులతో బోధించనున్నట్లు పాఠశాల విద్య ఆర్జేడీ మార్తాల వెంకట కృష్ణారెడ్డి వెల్లడించారు. ఉదయం 11 గంటల నుంచి […]

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ నెల 13 నుంచి వీడియో పాఠాలు..
Follow us

|

Updated on: Jul 10, 2020 | 5:53 PM

కడప: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు ఎటువంటి ఆటంకం కలగకుండా దూరదర్శన్ ద్వారా పాఠాలు ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జిల్లా వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నెల 13వ తేదీ నుంచి దూరదర్శన్ ఛానల్ ద్వారా వీడియో పాఠాలను సబ్జెక్ట్ నిపుణులతో బోధించనున్నట్లు పాఠశాల విద్య ఆర్జేడీ మార్తాల వెంకట కృష్ణారెడ్డి వెల్లడించారు.

ఉదయం 11 గంటల నుంచి 12 వరకు 1, 2 తరగతులు విద్యార్థులకు, మధ్యాహ్నం 12-1 గంట వరకు 3,4,5 తరగతుల విద్యార్థులకు వీడియో పాఠాలు బోధించనున్నారు. అలాగే మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు 6,7వ తరగతి విద్యార్థులకు, సాయంత్రం 3 నుంచి 4 గంటల వరకు 8,9 తరగతుల విద్యార్థులకు వీడియో క్లాసులు తీసుకోనున్నారు. ఇక పదో తరగతి విద్యార్థులకు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు లాంగ్వేజ్ క్లాసులు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు మిగిలిన సబ్జెక్టులకు సంబంధించిన వీడియో పాఠాలను ప్రసారం చేయనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ వీడియో పాఠాలు నెలాఖరు దాకా ఉంటాయన్నారు. జిల్లాలోని పాఠశాలల ప్రిన్సిపాల్స్, టీచర్లకు ఈ విషయాన్ని విద్యార్థులకు తెలియజేయాలన్నారు. అలాగే స్టూడెంట్స్ ఈ అవకాశాన్ని తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని కృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

Also Read:

తెలంగాణ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఇంటర్ సిలబస్‌లో 30% కోత.!

భక్తులకు ముఖ్య గమనిక.. వాటి జోలికి వెళ్లొద్దంటూ టీటీడీ హెచ్చరిక..

వారంతా కంపార్ట్‌మెంటల్‌లో పాస్.. ఏపీ ఇంటర్ బోర్డు నిర్ణయం..

ఆ 8 రాష్ట్రాల్లో కరోనా స్వైరవిహారం.. లిస్టులో ఏపీ, తెలంగాణ..!

గుంటూరులో కరోనా టెర్రర్.. నేటి నుంచి కొత్త నిబంధనలు..

కేంద్రం సంచలన నిర్ణయం.. వలస కూలీల కోసం అద్దె ఇళ్లు..!