ఆపిల్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. నవంబర్ 10న న్యూ లాంఛ్..!

ఆపిల్ ఫోన్ వినియోగదారులకు మరో గుడ్ న్యూస్... ఐఫోన్ 12 లాంచ్ తరువాత ఆపిల్ మరొక పరికరాన్ని లాంచ్ చేయడానికి ఫ్లాన్ చేస్తోంది.

ఆపిల్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. నవంబర్ 10న న్యూ లాంఛ్..!
Follow us

|

Updated on: Nov 03, 2020 | 9:10 PM

ఆపిల్ ఫోన్ వినియోగదారులకు మరో గుడ్ న్యూస్… ఐఫోన్ 12 లాంచ్ తరువాత ఆపిల్ మరొక పరికరాన్ని లాంచ్ చేయడానికి ఫ్లాన్ చేస్తోంది. కుపెర్టినో ఆధారిత టెక్ దిగ్గజం నవంబర్ 10వ తేదీన యాపిల్ సంస్థ ఓ లాంఛ్ ఈవెంట్ ను పెట్టుకుంది. ఇందుకు సంబంధించి జర్నలిస్టులకు వర్చువల్ ఆహ్వానాలను పంపింది. ఈ ఆన్ లైన్ ఈవెంట్ లో దేని గురించి చెబుతారో ఇంకా సరైన క్లారిటీ ఇవ్వలేదు.

ఐఫోన్ 12 సిరీస్ లాంచ్ తరువాత, ఆపిల్ ఇప్పుడు ఏమి ప్రారంభించబోతుందన్నది ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అయితే, ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ఆపిల్ స్వంత ప్రాసెసర్‌తో కొత్త మాక్‌బుక్‌లను లాంచ్ చేస్తారని అందరూ భావిస్తున్నారు. ఆపిల్ సొంత ప్రాసెసర్‌లతో ఉన్న మాక్‌లు 2020 చివరి నాటికి అందుబాటులోకి తెస్తామని ఈ ఏడాది ప్రారంభంలో WWDC-2020 లో కుక్ వెల్లడించారు. కొత్త మాక్‌బుక్స్‌తో పాటు, ఈ ఏడాది ఆపిల్ ఏదైనా కొత్త హార్డ్‌వేర్ ఉత్పత్తులను విడుదల చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది

మరోవైపు, యాపిల్ 13-ఇంచ్ మ్యాక్ బుక్ ఎయిర్, 13 ఇంచ్ మ్యాక్ బుక్ ప్రో, 16 ఇంచ్ మ్యాక్ బుక్ ప్రో లు యాపిల్ సిలికాన్ చిప్స్ తో రాబోతున్నాయనే వార్తలు వచ్చాక.. యాపిల్ ఈ కొత్త లాంఛింగ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసినట్లు కనిపిస్తుంది. అయితే, వీటి కోసమే ప్రత్యేకమైన ఈవెంట్ ను ఏర్పాటు చేశారా.. లేక ఇంకా ఎన్నో యాపిల్ ప్రోడక్ట్స్ ను తీసుకుని వస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఇదిలావుంటే, కొత్తగా రాబోయే మ్యాక్ కంప్యూటర్లు మరింత బాగా పనిచేస్తాయని సంస్థ ప్రతినిధులు చెబుతూ ఉన్నారు. పవర్ ఫుల్ యాప్స్ ను, హై ఎండ్ గేమ్స్ ను ఆడదానికి ఇంకా ఈజీగా ఉంటుందట..!

Latest Articles