యాపిల్ సంస్థ మరో కీలక నిర్ణయం.. ఆ రెండు దేశాల్లో స్టోర్స్ మూసివేస్తన్నట్లు ప్రకటన!

కరోనా కల్లోలానికి అన్ని రంగాలు విలవిలాడుతున్నాయి. నేపథ్యంలో ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 69 స్టోర్‌లను తాత్కాలికంగా..

యాపిల్ సంస్థ మరో కీలక నిర్ణయం.. ఆ రెండు దేశాల్లో స్టోర్స్ మూసివేస్తన్నట్లు ప్రకటన!
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 20, 2020 | 4:11 PM

కరోనా కల్లోలానికి అన్ని రంగాలు విలవిలాడుతున్నాయి. నేపథ్యంలో ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 69 స్టోర్‌లను తాత్కాలికంగా మూసేయడానికి సిద్ధమైంది. ఏడాది కాలంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రతిరోజు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. బ్రిటన్ లోనూ ఈ మహమ్మారి వికృతరూపం ప్రదర్శిస్తోంది. నిత్యం వేలాది మంత్రి ఈ రాకాసి వైరస్ కాటుకు బలవుతున్నాయి. దీంతో అయా దేశాల్లో ప్రభుత్వాలు మరోసారి ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో వ్యాపార లావాదేవీలు నిలిచిపోయాయి వాణిజ్య సంస్థలు మూతపడుతున్నాయి. ఈ నేపథ్యంలో యాపిల్ వస్తువుల కొనుగోళ్లు భారీగా స్తంభించాయి.

ఈ నేపథ్యంలో యాపిల్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో కరోనాకు హాట్ స్పాట్ గా మారింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని 53 స్టోర్‌లతోపాటు, బ్రిటన్ లోని 16 స్టోర్‌లను తాత్కాలికంగా మూసేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం. కొవిడ్ విజృంభిస్తున్న కారణంగా కొన్ని ప్రాంతాల్లో స్టోర్‌లను తాత్కాలికంగా మూసేయాల్సి వస్తోంది. సాధ్యమైనంత తొందరగా తిరిగి కస్టమర్లకు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు.