ఇద్దరు స్టార్‌‌‌‌హీరోలతో బాలీవుడ్‌‌‌‌‌‌‌లో ఆ సినిమా రీమేక్.. ప్రాజెక్ట్ నుంచి అనూహ్యంగా తప్పుకున్న ఓ హీరో

ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో రీమేకుల సందడి ఎక్కువగా కనిపిస్తుంది. ఒక భాషలో సినిమా హిట్ అయ్యిందంటే ఆ సినిమాను ఇతర భాషల్లో తెరకెక్కించేందుకు దర్శక నిర్మాతలు సిద్ధంగా ఉంటున్నారు.

ఇద్దరు స్టార్‌‌‌‌హీరోలతో బాలీవుడ్‌‌‌‌‌‌‌లో ఆ సినిమా రీమేక్.. ప్రాజెక్ట్ నుంచి అనూహ్యంగా తప్పుకున్న ఓ హీరో
Rajeev Rayala

|

Dec 20, 2020 | 5:15 PM

ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో రీమేకుల సందడి ఎక్కువగా కనిపిస్తుంది. ఒక భాషలో సినిమా హిట్ అయ్యిందంటే ఆ సినిమాను ఇతర భాషల్లో తెరకెక్కించేందుకు దర్శక నిర్మాతలు సిద్ధంగా ఉంటున్నారు. టాలీవుడ్ నుంచి ఈ మధ్య కాలంలో బాలీవుడ్ కు సినిమాలు బాగానే వెళ్లాయి. మనదగ్గర సూపర్ హిట్ అయిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాను అక్కడ కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా అక్కడ భారీ హిట్‌‌‌ను అందుకుంది. అలాగే నాని నటించిన ‘జెర్సీ’ సినిమాను కూడా ఇప్పుడు రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాతోపాటు ‘బ్రోచేవారెవరురా’ లాంటి చిన్న సినిమాను కూడా హిందీలోకి తీసుకు వెళ్తున్నారు.

తాజాగా తమిళ్‌‌‌‌‌లో సూపర్ హిట్ అందుకున్న ‘విక్రమ్ వేధా’ సినిమాను త్వరలో బాలీవుడ్‌‌‌లో రీమేక్ చేయనున్నారు. పుష్కర్ గాయత్రిలే దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రీమేక్‌‌‌‌లో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మరో స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించనున్నారనే వార్త హల్‌‌‌‌చల్ చేస్తుంది. ఒరిజినల్ లో మాధవన్, విజయ్ సేతుపతి కలిసి నటించారు. మాధవన్ పాత్రలో అమీర్ ఖాన్, విజయ్ సేతుపతి రోల్‌‌‌‌‌‌లో సైఫ్ కనిపించనున్నారని ప్రచారం జరుగుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ నుంచి అమీర్ ఖాన్ తప్పుకున్నారని అంటున్నారు. ఇప్పుడు అమీర్ ప్లేస్‌‌‌లో నటించే మరో హీరో కోసం నిర్మాతలు వెతుకుతున్నారట. మరి ఈ వార్తలో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu