Bigg Boss 4 : బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ప్రోమో.. స్టేజ్ పైన మెరిసిన తారలు.. సందడి చేసిన కంటెస్టెంట్స్
బిగ్ బాస్ సీజన్ 4 ఫైనలేను గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసారు. మరికొన్ని గంటల్లోనే సీజన్ 4కు తెరపడనుంది. తాజాగా గ్రాండ్ ఫినాలే ప్రోమోను విడుదల చేశారు.

బిగ్ బాస్ సీజన్ 4 ఫైనలేను గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసారు. మరికొన్ని గంటల్లోనే సీజన్ 4కు తెరపడనుంది. తాజాగా గ్రాండ్ ఫినాలే ప్రోమోను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొన్న కంటెస్టెంట్స్ అంతా వచ్చారు. తమ డ్యాన్స్ లతో మరోసారి అలరించారు. అందరు తో నాగార్జున ముచ్చటించారు. ఇక వీరితోపాటు హౌస్ లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ అభిజీత్, అరియానా, హారిక, సోహెల్, అఖిల్ కుటుంబసభ్యులు కూడా వచ్చారు. ఇక ఈ ఫినాలేలో ముద్దుగుమ్మలు మెహరీన్, ప్రణీత తమ డ్యాన్స్ లతో అక్కటుకున్నారు.
అదేవిధంగా దర్శకుడు అనీల్ రావిపూడి హౌస్ లోకి వెళ్లి ఐదుగురు కంటెస్టెంట్స్ తో సరదాగా ముచ్చటించారు. దాంతోపాటు సంగీత దర్శకుడు తమన్ తన మ్యూజిక్ టీమ్ తో స్టేజ్ పైన సందడి చేసారు. ఇదంతా ప్రోమోలో చూపించారు. అలాగే మరో ఆసక్తికర విషయం కూడా జరిగింది. బిగ్ బాస్ హౌస్లో కి వచ్చిన వాళ్లలో స్వాతి దీక్షిత్ కూడా ఉంది. ఈ అమ్మడు వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి వెంటనే ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిపోయింది. అయితే ఫినాలే కు హాజరైన ఆమెను నాగార్జున నెక్స్ట్ ఎం చేస్తున్నావ్ అని ప్రశ్నించగా రామ్ గోపాల్ వర్మ తో సినిమా చేస్తున్ననని చెప్పింది. దానికి వెంటనే నాగార్జున జాగ్రత అని అన్నారు. దాంతో ఒక్కసారిగా స్టేజ్ పైన నవ్వులు పూసాయి. ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి కొద్ధి గంటల్లో జరగబోయే ఈ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.




