AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APP Revenue 2020: గతేడాది ఏ యాప్‌కు ఎంత ఆదాయం వచ్చిందో తెలుసా..? టిక్‌ టాక్‌ పరిస్థితి తెలిస్తే షాక్‌ కావాల్సిందే..

APP Revenue Detailes 2020: స్మార్ట్‌ ఫోన్‌ల వినియోగం పెరిగనప్పటి నుంచి యాప్‌ల ప్రాధాన్యత బాగా పెరిగింది. ప్రతీ అవసరానికి ఒక యాప్‌...

APP Revenue 2020: గతేడాది ఏ యాప్‌కు ఎంత ఆదాయం వచ్చిందో తెలుసా..? టిక్‌ టాక్‌ పరిస్థితి తెలిస్తే షాక్‌ కావాల్సిందే..
Narender Vaitla
|

Updated on: Jan 12, 2021 | 6:23 AM

Share

APP Revenue Detailes 2020: స్మార్ట్‌ ఫోన్‌ల వినియోగం పెరిగనప్పటి నుంచి యాప్‌ల ప్రాధాన్యత బాగా పెరిగింది. ప్రతీ అవసరానికి ఒక యాప్‌ అన్న విధంగా కొత్త కొత్త ఆప్లికేషన్‌లు పుట్టుకొస్తున్నాయి. ఇక కొన్ని యాప్‌లు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొంది రూ. కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తూ దూసుకెళుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా యాప్‌ అనలిటిక్స్‌ సంస్థ అప్టోపియా గతేడాది లాభాలను ఆర్జించిన యాప్‌ల వివరాలను వెల్లడించింది. ఈ జాబితాలో మొదటి వరుసలో ప్రముఖ వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌ తొలి స్థానంలో నిలవడం ఆశ్చర్యం కలిగించే అంశం. ఈ యాప్‌కు భారీగా యూజర్లు ఉన్న భారత్‌లో నిషేధించినా, అమెరికాలో న్యాయ పోరాటం ఎదుర్కొంటున్నా టిక్‌టాక్‌ మొదటి స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ యాప్‌ ఏకంగా 540 మిలియన్ డాలర్ల లాభంతో ప్రపంచవ్యాప్తంగా అత్యంత లాభదాయకమైన యాప్ గా నిలిచింది. ఇక ప్రముఖ డేటింగ్‌ యాప్‌ టిండర్ 513 మిలియన్ల డాలర్ల లాభంతో రెండవ స్థానంలో నిలిచింది. 478 మిలియన్ల డాలర్ల లాభంతో యూట్యూబ్‌ మూడో స్థానంలో.. 314 మిలియన్ల డాలర్లతో డిస్నీ 4వ స్థానంలో నిలిచాయి. ఇక 300 మిలియన్‌ డాలర్ల లాభంతో టెన్సెంట్‌ యాప్‌ 5వ స్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే నెట్‌ఫ్లిక్స్‌ 209 డాలర్ల లాభంతో 10వ స్థానంలో నిలిచింది.

Also Read: LAVA New Mobiles: ‘లావా’ నుంచి సరికొత్త మొబైల్ ఫోన్లు, ఫిట్‌నెస్ బాండ్లు.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్..