అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ మళ్లీ వాయిదా

కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి ఈనెల 25న జరగాల్సిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం మరోసారి వాయిదా పడింది. ఈమేరకు కేంద్ర జల్‌ శక్తి మత్రిత్వశాఖ రెండు తెలుగు రాష్ట్రాలకు అధికారికంగా సమాచారం అందించింది.

అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ మళ్లీ వాయిదా
Follow us

|

Updated on: Aug 23, 2020 | 2:08 PM

కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి ఈనెల 25న జరగాల్సిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం మరోసారి వాయిదా పడింది. ఈమేరకు కేంద్ర జల్‌ శక్తి మత్రిత్వశాఖ రెండు తెలుగు రాష్ట్రాలకు అధికారికంగా సమాచారం అందించింది.

రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అయా రాష్ట్రాల్లో చేపడుతున్న ప్రాజెక్టులపై పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. దీంతో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి అపెక్స్ కమిటీ సమావేశం కావాలని నిర్ణయించింది.నాలుగు అంశాలు ఎజెండాగా ఈ నెల 25న సమావేశం జరగాల్సి ఉంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేయడంతో కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా 25న అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు తెలుగు రాష్ట్రాల సీఎంలకు ముందుగానే సమాచారం పంపింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన అపెక్స్‌ కౌన్సిల్‌కు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ఛైర్మన్‌గా, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్నారు. అయితే కేంద్ర మంత్రి షెకావత్‌ కు కొవిడ్‌ నిర్ధారణ కావడంతో సమావేశాన్ని అనివార్యంగా వాయిదా వేయాల్సి వచ్చిందని జల్‌శక్తి మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ నెలలో సమావేశం జరిగే అవకాశం లేదని.. సెప్టెంబరులో జరగవచ్చని అధికారులు వెల్లడించారు.