AP Ward and Village Secretariat: గ్రామ సచివాలయాలకు రేపటితో రెండేళ్లు.. ప్రజలకు చేరువైన పాలన..

AP Ward and Village Secretariat: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ఏర్పాటై రేపటితో రెండేళ్లు పూర్తికానుంది.

AP Ward and Village Secretariat: గ్రామ సచివాలయాలకు రేపటితో రెండేళ్లు.. ప్రజలకు చేరువైన పాలన..
Ap Village Secretariat
Follow us

|

Updated on: Oct 01, 2021 | 9:10 PM

AP Ward and Village Secretariat: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ఏర్పాటై రేపటితో రెండేళ్లు పూర్తికానుంది. సరిగ్గా రెండేళ్ల క్రితం అంటే 2019 అక్టోబర్ 2వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. ఈ గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు ద్వారా లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తోంది ఏపీ సర్కార్. గ్రామ, వార్డు సచివాలయాల్లో దాదాపు 1.40 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. సచివాలయాలకు అనుబంధంగా 2,54,832 మంది వాలంటీర్లతో కూడిన వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇప్పటి వరకు 3.08 కోట్ల పౌర సేవలకు వినతులను స్వీకరించారు. ఇందులో 2.67 కోట్ల సేవలను నిర్దేశిత సమయంలో పూర్తి చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. రైస్ కార్డు, ఇళ్ల పట్టాలు, ఆరోగ్య శ్రీ, పెన్షన్ కాను, రైతు భరోసా, వాహన మిత్ర, వైఎస్ఆర్ చేయూత తదితర సంక్షేమ కార్యక్రమాల అమలులో గ్రామ, వార్డు సచివాలయాలు కీలకంగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ద్వారా కోటీ 65 లక్షల కుటుంబాలకు పౌరసేవలను అందించారు.

Also read:

A Man Attack With Ax: ఖమ్మం జిల్లాలో దారుణం.. రూ.70 కోసం గొడవ.. గొడ్డలితో దాడి..

వణుకు పుట్టిస్తున్న ఆత్మ.. ఆకట్టుకుంటున్న ‘అరణ్మనై 3’ ట్రైలర్.. రాశిఖన్నా-ఆర్య జంటగా..

Reliance: వచ్చేసింది రిలయన్స్ డిజిటల్‌ ‘ఎలక్ట్రానిక్స్ పండగ’.. అక్టోబర్ 3 నుంచి 12వరకు..