టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌పై కేసు న‌మోదు..

టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌పై కేసు న‌మోదు..

టీడీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరొంది..టీవీ చ‌ర్చా కార్య‌క్రామాల్లో పార్టీ వాయిస్ ను బ‌లంగా వినిపించే ..ఆ పార్టీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్‌ డౌన్ రూల్స్ అతిక్ర‌మించార‌నే ఆరోపణలతో ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌తో పాటు పలువురిపై కేసులు నమోదయ్యాయి. లాక్‌ డౌన్‌ నిబంధనలకు బేఖాత‌రు చేసి… గుంపులుగా టీడీపీ కార్యకర్తలతో కలిసి నిత్యావ‌స‌రాలు, కూర‌గాయ‌లు పంపిణీ చేయడంతో రాజేంద్రప్రసాద్‌తో పాటు 9 మంది అనుచరులపై పోలీసులు కేసు పెట్టారు. లాక్‌డౌన్‌ సమయంలో […]

Ram Naramaneni

|

May 04, 2020 | 8:54 PM

టీడీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరొంది..టీవీ చ‌ర్చా కార్య‌క్రామాల్లో పార్టీ వాయిస్ ను బ‌లంగా వినిపించే ..ఆ పార్టీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్‌ డౌన్ రూల్స్ అతిక్ర‌మించార‌నే ఆరోపణలతో ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌తో పాటు పలువురిపై కేసులు నమోదయ్యాయి. లాక్‌ డౌన్‌ నిబంధనలకు బేఖాత‌రు చేసి… గుంపులుగా టీడీపీ కార్యకర్తలతో కలిసి నిత్యావ‌స‌రాలు, కూర‌గాయ‌లు పంపిణీ చేయడంతో రాజేంద్రప్రసాద్‌తో పాటు 9 మంది అనుచరులపై పోలీసులు కేసు పెట్టారు.

లాక్‌డౌన్‌ సమయంలో భౌతిక దూరం పాటించకుండా రూల్స్ అతిక్ర‌మించ‌డంతో ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్‌పై కేసు నమోదు చేసినట్లు ఉయ్యూరు పోలీసులు వెల్లడించారు. కాగా, ఇటీవ‌లే టీడీపీ ఎంపీ కేశినేని నానిపై లాక్‌డౌన్ రూల్స్ క్రాస్ చేశార‌ని పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాణాంత‌క వైర‌స్ తీవ్రంగా విస్త‌రిస్తోన్న స‌మ‌యంలో పేద‌ల‌కు సాయం చెయ్య‌డం మంచిదే కానీ..స‌రైన జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే వారికి ఎక్కువ హాని చేసిన‌వారు అవుతార‌ని అధికార‌లు హెచ్చ‌రిస్తున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu